పుట్టగొడుగులతో బోర్డులు

ఎన్నో పోషకాలు ఉండే పుట్టగొడుగుల్ని ఆహారంగా తీసుకోవడంతోపాటు మందుల తయారీలోనూ వాడతారు. అయితే కొన్ని రకాల పుట్టగొడుగులతో పర్యావరణ హితమైన ఉత్పత్తుల్నీ తయారుచేయవచ్చు అంటున్నారు ఆస్ట్రియాలోని జొహాన్స్‌ కెప్లర్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు.

Published : 04 Dec 2022 00:04 IST

పుట్టగొడుగులతో బోర్డులు

న్నో పోషకాలు ఉండే పుట్టగొడుగుల్ని ఆహారంగా తీసుకోవడంతోపాటు మందుల తయారీలోనూ వాడతారు. అయితే కొన్ని రకాల పుట్టగొడుగులతో పర్యావరణ హితమైన ఉత్పత్తుల్నీ తయారుచేయవచ్చు అంటున్నారు ఆస్ట్రియాలోని జొహాన్స్‌ కెప్లర్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు. రెయిషి అనే పుట్టగొడుగుల పైపొర ఎంతో గట్టిగా ఉండి లోపలున్న మెత్తని భాగాల్ని కాపాడుతుంది.
ఈ పొరని తీసి ఎండబెడితే అది ఎంతో వేడిని తట్టుకుంటుందట. ఆ తరవాత దీన్ని నేలమీద వేస్తే భూమిలో కలిసిపోయింది. ఈ లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని మైసిలియోట్రానిక్‌ అనే పదార్థాన్ని రూపొందించి ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో వాడొచ్చు అంటున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్‌లో వాడే సర్క్యూట్‌ బోర్డులను పాలిమర్లతో తయారుచేయడంవల్ల అవి ఇతర పదార్థాలతో కలిసి ఉండటంతో రీసైకిల్‌ చేయడం కష్టంగా ఉంది. అదే వాటిని పుట్టగొడుగుల నుంచి తీసిన పదార్థంతో చేస్తే అది త్వరగా నేలలో కలిసిపోతే మిగిలిన మెటల్‌ను సులభంగా రీసైకిల్‌ చేయవచ్చు అంటున్నారు. అంతేకాదు, దీన్ని శరీరంలో కలిసిపోయే మెడికల్‌ ఇంప్లాట్స్‌ తయారీకీ, కృత్రిమ లెదర్‌కీ ప్రత్యామ్నాయంగానూ కూడా వాడొచ్చట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..