తాబేళ్ల కన్నీళ్లే అక్కడి సీతాకోక చిలుకలకు ఆహారం

రంగురంగుల సీతాకోక చిలుకలన్నీ తాబేళ్ల చుట్టూ చేరి ముద్దులతో ముంచేస్తున్నట్టు ఉన్నాయి కదూ ఇక్కడున్న చిత్రాల్ని చూస్తుంటే. కానీ ఈ ముద్దులముచ్చట వెనక అసలు కారణం వేరే ఉందండోయ్‌.

Updated : 19 May 2024 02:48 IST

రంగురంగుల సీతాకోక చిలుకలన్నీ తాబేళ్ల చుట్టూ చేరి ముద్దులతో ముంచేస్తున్నట్టు ఉన్నాయి కదూ ఇక్కడున్న చిత్రాల్ని చూస్తుంటే. కానీ ఈ ముద్దులముచ్చట వెనక అసలు కారణం వేరే ఉందండోయ్‌. మామూలుగా సీతాకోక చిలుకలు- పూల మీద వాలి మకరందాల్ని జుర్రుకుంటే... అమెజాన్‌ అడవుల్లో ఉండే సీతాకోక చిలుకలు మాత్రం ఇలా అక్కడి తాబేళ్ల కన్నీళ్లలోని లవణాల్ని తీసుకుంటాయి. ఇక్కడుండే ఎనిమిది రకాల సీతాకోకచిలుక జాతులకు మిగిలిన ఆహారంతోపాటూ సోడియమూ అవసరమే. అప్పుడే వాటి జీవనం సాఫీగా సాగుతుంది. కానీ అమెజాన్‌ అడవిలోని చెట్లలో, నేలలో, చుట్టూ పరిసరాల్లో ఎక్కడా ఆ సోడియం దొరకకపోవడంతో తాబేళ్లూ, మొసళ్లలాంటి జీవుల కన్నీళ్లను తాగుతూ ఆ లోటును భర్తీ చేసుకుంటాయి. తాబేళ్లలోని అదనపు సోడియాన్ని మాత్రమే సీతాకోకచిలుకలు తీసుకోవడం వల్ల వాటికీ ఎలాంటి హానీ ఉండదట. ఇదీ ఈ సీతాకోక చిలుకల కన్నీటివిందు కథ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..