అమ్మాయిలే అమ్మవారిలా...

‘మహా కనకదుర్గా విజయ కనకదుర్గా, పరాశక్తి లలితా శివానంద చరితా’ అంటూ ఏడేడు లోకాలనేలేటి ఆ తల్లిని ఎన్నెన్నో రూపాల్లో కొలిచే నవరాత్రులివి. భక్తులందరూ ఒక్కొక్కరు ఒక్కోలా ఆ అమ్మని ఆరాధిస్తుంటే... తమిళనాడుకు చెందిన ఆర్టిస్టు హర్షద్‌ తన కళతోనే భక్తిని చూపిస్తున్నాడు.

Updated : 02 Oct 2022 03:52 IST

అమ్మాయిలే అమ్మవారిలా...

‘మహా కనకదుర్గా విజయ కనకదుర్గా, పరాశక్తి లలితా శివానంద చరితా’ అంటూ ఏడేడు లోకాలనేలేటి ఆ తల్లిని ఎన్నెన్నో రూపాల్లో కొలిచే నవరాత్రులివి. భక్తులందరూ ఒక్కొక్కరు ఒక్కోలా ఆ అమ్మని ఆరాధిస్తుంటే... తమిళనాడుకు చెందిన ఆర్టిస్టు హర్షద్‌ తన కళతోనే భక్తిని చూపిస్తున్నాడు. మేకప్‌ మాయతో అమ్మలగన్న అమ్మ రూపాలన్నింటినీ కళ్లముందుకు తీసుకొస్తున్నాడు. ‘డివోషనల్‌ మేకప్‌ ఫొటోగ్రఫీతో మనుషుల్నే అమ్మవారి రూపాలతో అలంకరిస్తున్నాడు. దేవి రూపానికి తగ్గట్టు ఆభరణాలూ, వస్త్రాలూ, ఆయుధాలూ ఎంచుకోవడమే కాదు... అవతారానికి సరిపోయేలా చూపుల దగ్గర్నుంచి హావభావాలూ, కూర్చునే భంగిమల వరకూ అన్నీ దేవతామూర్తుల చిత్రపటంలో ఉన్నట్టుగానే తీసుకొస్తున్నాడు. దేవుడు అన్నిచోట్లా ఉంటాడన్నట్టుగా ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూస్తానంటున్నాడీ కళాకారుడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..