ఆ హార్మోన్‌ ఆధారంగా...

మగపిల్లలైనా ఆడపిల్లలైనా యుక్తవయసుకి చేరుకునే దశలో కొన్ని హార్మోన్లు విడుదలవుతాయి. అయితే అబ్బాయిల్లో విడుదలయ్యే ఓ హార్మోన్‌ ఆధారంగా తరవాతి కాలంలో వాళ్లకు వచ్చే వ్యాధుల్ని గుర్తించవచ్చు అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ నాటింగ్‌హామ్‌ పరిశోధకులు.

Published : 04 Dec 2022 00:00 IST

ఆ హార్మోన్‌ ఆధారంగా...

గపిల్లలైనా ఆడపిల్లలైనా యుక్తవయసుకి చేరుకునే దశలో కొన్ని హార్మోన్లు విడుదలవుతాయి. అయితే అబ్బాయిల్లో విడుదలయ్యే ఓ హార్మోన్‌ ఆధారంగా తరవాతి కాలంలో వాళ్లకు వచ్చే వ్యాధుల్ని గుర్తించవచ్చు అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ నాటింగ్‌హామ్‌ పరిశోధకులు. ఇన్సులిన్‌ను పోలిన ఈ హార్మోన్‌ను ఐఎన్‌ఎస్‌ఎల్‌3 అని పిలుస్తు న్నారు. టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌లోని కణాలే ఇందులోనూ ఉంటాయి. వయసు పెరిగేకొద్దీ టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌లో హెచ్చుతగ్గులు ఏర్పడుతుం టాయి. కానీ ఐఎన్‌ఎస్‌ఎల్‌3 జీవితాంతం ఒకే స్థాయిలో ఉంటుంది. వృద్ధాప్యంలో మాత్రమే కొంత మేర తగ్గుతుంది. కాబట్టి దీని ఆధారంగా వయసుతో పాటు వచ్చే రుగ్మతల్ని గుర్తించవచ్చు అంటున్నారు. అంటే- తరవాతి కాలంలో నరాల బలహీనత, మధుమేహం, హృద్రోగం... వంటివి తలెత్తే ప్రమాదం ఉందో లేదో తెలుసుకోవచ్చట. ఇందుకోసం వీళ్లు అనేక ప్రాంతాల్లోని వ్యక్తుల్ని పరిశీలించగా- చిన్న వయసులో ఆరోగ్యంగా ఉన్న పురుషుల్లో ఈ హార్మోన్‌ శాతంలో వ్యత్యాసాలు కనిపించాయట. ఈ హార్మోన్‌ శాతం తక్కువగా ఉన్నవాళ్లు- వృద్ధాప్యంలో అనేక రోగాల బారినపడుతున్నారనీ, అందుకే అవి రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చనీ చెబుతున్నారు. చిన్నప్పుడు తినే పోషకాహారం, జన్యువులు, పర్యావరణం కూడా ఈ హార్మోన్‌ శాతాన్ని ప్రభావితం చేస్తుండవచ్చని చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..