సిల్లీపాయింట్‌

నాలుగు- అంకె అంటే ఉన్న భయాన్ని టెట్రాఫోబియా అంటారు. ఆ భయం ఎవరికుంటుందంటారా... చైనీయులకి ఉంటుంది. వాళ్ళ భాషలో నాలుగుకీ చావుకీ ‘పిన్‌యిన్‌’ అన్న పదమే వాడతారు.

Published : 24 Mar 2024 01:53 IST

నాలుగు- అంకె అంటే ఉన్న భయాన్ని టెట్రాఫోబియా అంటారు. ఆ భయం ఎవరికుంటుందంటారా... చైనీయులకి ఉంటుంది. వాళ్ళ భాషలో నాలుగుకీ చావుకీ ‘పిన్‌యిన్‌’ అన్న పదమే వాడతారు. అందుకే ఫోనూ, ఇంటి నంబర్లలో ‘నాలుగు’ రాకుండా జాగ్రత్తపడతారు!

  •  జర్మనీలోని 80 శాతం ఇళ్ళల్లో ఇప్పటికీ ల్యాండ్‌లైన్‌ ఫోన్‌లే ఉపయోగిస్తున్నారు.
  •   ముళ్ళపందులు ఈత కొట్టాల్సిన అవసరం లేకుండా... నీళ్ళలో తేలిపోతాయి.
  •  ఇటలీలోని మిలన్‌లో పౌరులెప్పుడూ బయటకు వచ్చేటప్పుడు చిరునవ్వుతోనే ఉండాలన్నది చట్టం. అంత్యక్రియలకీ, ఆసుపత్రులకు వెళుతున్నవాళ్ళకీ మాత్రమే ఇందుకు మినహాయింపు ఉంటుంది.  
  •  జమైకాలో పిల్లలకి గుడ్లు తినిపించరు. గుడ్డు తిన్న పిల్లలు కోడిపిల్లల్లా ప్రవర్తిస్తారని వాళ్ళ నమ్మకమట.
  •  వర్షపు నీటిలో ‘బీ12’ విటమిన్‌ ఉంటుందట.
  •  మస్కారా తయారీలో ఖర్జూరాల విత్తనాలని కూడా వాడతారు.
  •  సొరచేపలు మనుషుల్ని తినవు... మనల్ని అసలు ఆహారంగానే భావించవు. మరి వాటివల్ల జరిగిన మరణాల మాటేమిటంటారా... మనుషుల్ని డాల్ఫిన్స్‌గానో, ఇంకేదైనా పెద్ద ఆహారమనో భ్రమపడటం వల్లే దాడులు చేస్తాయట!
  •  ఆపిల్‌ సంస్థ ఐప్యాడ్‌ స్క్రీన్‌ని శామ్‌సంగ్‌ కంపెనీయే తయారుచేస్తుంది!
  •  నక్కలు తమ తోకతోనూ మాట్లాడుకోగలవు.
  •  ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి సుమారు రెండువేల పిడుగులు పడుతుంటాయట.

'స్ట్రాబెర్రీలూ, రోజా పూలూ ఒకే జాతి(జీనస్‌)కి చెందినవి!


 పెంపుడు పక్షుల్లో ఎక్కువగా ఊబకాయంతో బాధపడేవి... చిలకలేనట.


మగవారితో పోలిస్తే స్త్రీలు వాసనల్ని 20 రెట్లు ఎక్కువగా గుర్తుపడతారట. సిగరెట్‌ తాగి బబుల్‌గమ్‌ తిన్నా, స్నానం చేయకుండా చేశానని అబద్ధమాడినా వాళ్ళు ఇట్టే పసిగట్టడానికి కారణం అదే!


విమానం నడిపే పైలట్‌, కోపైలట్‌ ఒకే ఆహారం తినకూడదన్న రూల్‌ ఉంది. వేర్వేరు వంటవాళ్ళు వేర్వేరు చోట్ల తయారుచేసిందే వాళ్ళు తినాలి. ఫుడ్‌ పాయిజన్‌ లాంటి విపత్తు సంభవించినా- కనీసం ఒక్కరైనా విమానాన్ని నడపగల స్థితిలో ఉండాలని- ఈ ఏర్పాటు.


ఉత్తర భారతదేశంలో చాలాచోట్ల గురువారం కిచిడీ తినరు! అది పసుపు రంగులో ఉండటం, పసుపు విష్ణు రూపం కావడం (పీతాంబరుడు కదా), గురువారం ఆయన రోజుగా భావించడం వల్ల ఈ నియమం పాటిస్తారు.


నీటి ఏనుగులు ఆవులించడం చూసుంటారు... కాకపోతే అది నిద్రకి సంకేతం కాదు! ‘నాకు చాలా పెద్ద పళ్ళున్నాయి... జాగ్రత్త సుమా!’ అని ఎదుటివాళ్ళని బెదిరించడానికట.


అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో గెయిన్స్‌విలే అనే నగరం ఉంది. అక్కడ- చికెన్‌ని చేతులతో తప్ప ఫోర్క్స్‌తోకానీ, చెంచాలతోకానీ తినడం నేరం. ప్రపంచంలో అత్యధికంగా కోళ్ళ ఫారమ్‌లు ఉన్న నగరం ఇదేనట. తమకి కోట్లు ఆర్జించి పెడుతున్న కోడిపైన మమకారంతో ఈ చట్టం తెచ్చారట!


అమెరికన్లు దనియాల్ని ‘కొరియాండర్‌’ అంటారు. మరి కొత్తిమీరని ‘కొరియాండర్‌ లీవ్స్‌’ అనాలిగా మనలాగే, అలా అనరు. ‘సిలాంట్రోస్‌’ అని పిలుస్తారు.  


యూట్యూబో, టీవీ సీరియలో, మోడలింగో... ఇలా, చిన్నారులు ఎలా డబ్బు సంపాదించినా ఆ మొత్తానికి తల్లిదండ్రులు పన్ను కట్టాల్సిందే. ఏడాదికి కేవలం 1500 రూపాయలకన్నా తక్కువుంటే మాత్రమే మినహాయింపు ఉంటుంది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..