సిల్లీపాయింట్‌

మాట్లాడుతూ ముఖంలో హావభావాలు పలికిస్తుంటాం కదా! వీటిని మిగతావాళ్ళకన్నా ఇటలీ ప్రజలే ఎక్కువగా ఉపయోగిస్తారట. వాటి కోసం డిక్షనరీలు ఉన్నాయక్కడ!

Published : 28 Apr 2024 00:45 IST

మాట్లాడుతూ ముఖంలో హావభావాలు పలికిస్తుంటాం కదా! వీటిని మిగతావాళ్ళకన్నా ఇటలీ ప్రజలే ఎక్కువగా ఉపయోగిస్తారట. వాటి కోసం డిక్షనరీలు ఉన్నాయక్కడ!

బంగారు తాపడంతో ఉన్న వేలూరు స్వర్ణ దేవాలయాన్నో, తిరుపతినో చూసి ఎంతగానో ఆశ్చర్యపోతాం కదా! అలా- భూమి మొత్తానికీ పూత వేసేంత బంగారం మన భూగర్భంలో ఉందట.

  • ఆస్ట్రేలియాలో 1998 దాకా... ఇంట్లో బల్బు కాలిపోతే మనమే మార్చకూడదు. ఆపాటి పనికి కూడా సర్టిఫైడ్‌ ఎలక్ట్రీషియన్నే పిలవాలన్న రూలుండేది!
  • అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరం, నాగాలాండ్‌, లక్షద్వీప్‌- ఈ ప్రాంతాల్లోకి అడుగుపెట్టే పరాయి రాష్ట్రాలవాళ్ళు ఎవరైనా సరే ‘ఇన్నర్‌ లిమిట్‌ పర్మిట్‌’(ఐఎల్‌పీ) అనే అనుమతి పత్రాన్ని తీసుకోవాలి.
  • కొన్ని రకాల ప్యాకేజ్డ్‌ చిప్స్‌ ఇట్టే నిప్పు అంటుకుంటాయి. పాశ్చాత్యదేశాల్లో ‘డొరిటో’ అన్న బ్రాండ్‌ కారణంగా అగ్నిప్రమాదాలూ జరిగిన దాఖలాలున్నాయి.
  • జంతువుల్లో ఒక్క జిరాఫీలు మాత్రమే... కొమ్ములతో పుడతాయి.
  • ప్రపంచంలో విడాకుల సంఖ్య ఎక్కువున్న దేశం మాల్దీవులు. ప్రతి వెయ్యి పెళ్ళిళ్ళలో ఐదు... పెటాకులవుతున్నాయట అక్కడ.
  • ఉత్తర కొరియాలో ఫ్రిజ్‌ల్ని సంపన్నులు- ఓ స్టేటస్‌ సింబల్‌గా మాత్రమే వాడతారు. దేశానికి విశిష్ట సేవలందించినవాళ్ళూ, క్రీడల్లో రాణించినవాళ్ళకి అక్కడి ప్రభుత్వం ఫ్రిజ్‌లనే బహుమానంగా ఇస్తుంది. కాకపోతే ఆ దేశంలో విద్యుత్తు కోతలెక్కువ కాబట్టి... ఆ ఫ్రిజ్‌లని పుస్తకాలూ బట్టలూ పెట్టే అల్మారాలలాగే వాడుతున్నారక్కడ.
  • నగల ఉత్పత్తిలోనే కాదు, వాడకంలోనూ చైనాయే ఫస్ట్‌. భారత్‌ది మూడో స్థానం. మరి రెండో స్థానం ఎవరిదంటారా- అమెరికాయే! అక్కడ స్థిరపడిన భారతీయులు, చైనీయులూ ఇందుకు కారణమని చెబుతున్నారు.
  • షాపింగ్‌ మాల్స్‌ ప్లే ఏరియాల్లో ఉండే పోకర్‌ మెషిన్‌లని పాశ్చాత్య దేశాల్లో జూదానికి వాడతారు! ఆటగాళ్ళని అది నిలువుదోపిడీ చేస్తుంది కాబట్టి ‘వన్‌హ్యాండ్‌ బండిట్‌’ (ఒంటిచేతి బందిపోటు) అని కూడా పిలుస్తారు అక్కడ దాన్ని.
  • సింగపూర్‌లో ఎవర్ని ఏ కారణంతో అరెస్టు చేసినా సరే- కనీసం 48 గంటలపాటు తమవాళ్ళు ఎవరితోనూ మాట్లాడనివ్వరు.
  • ఎముక మజ్జ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నవారిలో... చాలా అరుదుగా రెండు బ్లడ్‌ గ్రూపులు కనిపిస్తాయి!
  • కుక్కలూ పిల్లుల తర్వాత మనుషులు ఎక్కువగా పెంచుకునే జంతువు... కుందేలు.
  • మీరు సినిమాకో షాపింగ్‌కో వెళ్ళారు. సడెన్‌గా ఫోన్‌ చూసుకుంటే- ఛార్జింగ్‌ 5 శాతమే ఉంది. అయ్యో ఇప్పుడెలా... మా వాళ్ళకెలా ఫోన్‌ చేయాలి అని ఆందోళనపడతారు కదా! దాన్నే ‘ఛార్జింగ్‌ యాంగ్జైటీ’ అంటున్నారు ఇప్పుడు. ప్రపంచంలో 57 శాతం మంది వారంలో ఒక్కసారైనా ఈ ఆందోళన అనుభవిస్తున్నారట.

10 వేల ఏళ్ళకిందటి దాకా మనుషులందరికీ కళ్ళు మామూలు రంగులోనే ఉండేవి. ఆ తర్వాత ఏర్పడ్డ జన్యుమార్పుల కారణంగానే మనలో పిల్లికళ్ళు ఏర్పడ్డాయట!


నం రోజువారీ ఆహారంలో ఉప్పు వేసుకున్నట్టే...  సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌ దేశంలో తేనె వాడతారు. ప్రపంచంలో అత్యధికంగా తేనె దిగుమతి చేసుకునే దేశం
కూడా అదే.


ముందుభాగం- అదీ కిందివైపు కాస్త పొడవుగా ఉండే జపాన్‌ హైస్పీడ్‌ రైళ్ళని గమనించారా ఎప్పుడైనా! చూడటానికి ఓ పక్షి ముక్కులా ఉంటుందది. ఉండటం కాదు-
లకుముకి పిట్ట (కింగ్‌ఫిషర్‌) స్ఫూర్తితోనే ఆ ట్రైన్‌ని నిర్మించారట వాళ్ళు.


స్పైడర్‌ మ్యాన్‌, సూపర్‌మ్యాన్‌, ఐరన్‌ మ్యాన్‌లే కాదు- పాశ్చాత్య కామిక్‌ ప్రపంచంలో స్పైడర్‌ ఉమన్‌, సూపర్‌ ఉమన్‌, ఐరన్‌ ఉమన్‌లూ ఉన్నారు.


మెరికన్‌ కోళ్ళ ఫారాల్లో తెలుపు, ముదురు ఊదారంగే కాదు... నీలం, గులాబీ, పచ్చరంగు గుడ్లు పెట్టే కోళ్ళూ ఎక్కువగా ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..