పొద్దున పరమేశ్వరుడిగా రాత్రి గోపికగా!

సాధారణంగా శివుడికి అభిషేకాలతోపాటు రకరకాల అలంకారాలు చేయడం మామూలే. కానీ ఆ ఆలయంలో మాత్రం ఎక్కడా లేనివిధంగా సాయంత్రం కాగానే పరమేశ్వరుడిని గోపిక రూపంలో అలంకరిస్తారు.

Published : 26 Nov 2022 23:55 IST

పొద్దున పరమేశ్వరుడిగా రాత్రి గోపికగా!

సాధారణంగా శివుడికి అభిషేకాలతోపాటు రకరకాల అలంకారాలు చేయడం మామూలే. కానీ ఆ ఆలయంలో మాత్రం ఎక్కడా లేనివిధంగా సాయంత్రం కాగానే పరమేశ్వరుడిని గోపిక రూపంలో అలంకరిస్తారు. కాస్త వింతగా ఉండే ఆ మందిరమే బృందావనంలో ఉన్న గోపికేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయం. యమునా నదికి దగ్గర్లో ఉన్న ఈ శివాలయంలోని లింగాన్ని కృష్ణుడి ముని మనవడు ప్రతిష్ఠించాడని చెబుతారు. మరి స్వామికి స్త్రీ అలంకారం ఎందుకంటే... దాని వెనుక చిన్న కథ ఉంది. బృందావనంలో పౌర్ణమి రోజుల్లో కృష్ణుడు గోపికల రాసలీలల్ని ఓసారి పరమేశ్వరుడూ చూడాలనుకున్నాడట. కానీ ఆయన్ని బృందావనాన్ని పాలించే వృందాదేవి అడ్డుకుందట. స్వామి వినకపోవడంతో చివరకు యమునానదిలో ఓసారి మునిగి రమ్మని చెప్పిందట. అలా మునిగి బయటకు వచ్చాక పరమేశ్వరుడు గోపికగా మారిపోయి రాసలీలల్లో తానూ భాగమయ్యాడట. ఇది తెలిసి కృష్ణుడు స్వామిని గోపికేశ్వర్‌గా పిలిచాడట. అప్పటినుంచే - సాయంత్రం కాగానే స్వామికి బొట్టు, కాటుక, ముక్కుపుడక, చీర... వంటివన్నీ అలంకరించి, పూజించే సంప్రదాయం వచ్చిందని చెబుతారు ఆలయ నిర్వాహకులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..