ఇళ్లు కావివి, సమాధులు!

ఇక్కడ కొండలమీద కనిపిస్తున్నవి ఇళ్లు అనుకుంటే పొరపాటే! చైనాకు పొరుగునున్న తైవాన్‌లోని శ్మశాన వాటికలివి. మరణానంతరం తమవాళ్లు ఆత్మల రూపంలో తిరుగుతారని వీరు నమ్ముతారు. అందుకే సమాధుల్ని ఇళ్ల మాదిరిగా నిర్మిస్తారు.

Published : 17 Feb 2024 23:58 IST

ఇక్కడ కొండలమీద కనిపిస్తున్నవి ఇళ్లు అనుకుంటే పొరపాటే! చైనాకు పొరుగునున్న తైవాన్‌లోని శ్మశాన వాటికలివి. మరణానంతరం తమవాళ్లు ఆత్మల రూపంలో తిరుగుతారని వీరు నమ్ముతారు. అందుకే సమాధుల్ని ఇళ్ల మాదిరిగా నిర్మిస్తారు. అంతేకాదు, ఏటా ఒకరోజున ప్రజలంతా వాటి దగ్గరకు వెళ్లి పరిసరాల్ని శుభ్రంచేసి ప్రార్థనలు చేస్తారు. తైవాన్‌లో మైదాన ప్రాంతం చాలా తక్కువ. అందుకే పర్వతాల మీద సమాధుల్ని నిర్మిస్తుంటారు. ఒకప్పుడు వీటిని ఒకదానికొకటి దూరంగా, విశాలంగా నిర్మించేవారు. ఇప్పుడు అక్కడా స్థలానికి కొరత ఏర్పడింది. అందుకే అపార్ట్‌మెంట్‌ల మాదిరిగా ఒకదానికొకటి ఆనుకొని ఉండేలా నిర్మిస్తున్నారు! కొన్ని స్థిరాస్తి కంపెనీలూ శ్మశానవాటికల్ని నిర్మించడం, కొందరు వాటిని ముందుగానే బుక్‌ చేసుకుని ఉంచుకోవడం విశేషం!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..