కొండ లోపల చూసొద్దామా!

పే...ద్ద బండరాయిపైన ఎక్కి సరదాగా ఫొటోలు తీసుకోవడం తెలిసిందే. కానీ స్పెయిన్‌లోని బొకైరెంట్‌ అనే పట్టణం దగ్గర్లో మాత్రం ఊరంత సైజు ఉన్న కొండ లోపలికెళ్లి తిరిగొస్తారు.

Published : 24 Feb 2024 23:38 IST

పే...ద్ద బండరాయిపైన ఎక్కి సరదాగా ఫొటోలు తీసుకోవడం తెలిసిందే. కానీ స్పెయిన్‌లోని బొకైరెంట్‌ అనే పట్టణం దగ్గర్లో మాత్రం ఊరంత సైజు ఉన్న కొండ లోపలికెళ్లి తిరిగొస్తారు. ‘అసలు కొండేంటీ... అందులోకి వెళ్లడమేంటీ’ అంటే...బోలెడన్ని గుహలతో ఉన్న కొండ అది.

మూరిష్‌ కేవ్స్‌గా పిలిచే ఈ కొండ గుహలే- ఒకప్పుడు ఇక్కడి ప్రజలకు ఆవాసాలట. యాభైకి పైగా పెద్ద పెద్ద కిటికీలతో మధ్యలో ద్వారంతో భలే గమ్మత్తుగా ఉంటుందీ కొండ మొత్తం. లోపలా కొండని తొలిచి ఏర్పాటు చేసిన రకరకాల గదులూ కనిపిస్తాయి. ఒక గది నుంచి మరో దాంట్లోకి వెళ్లడానికి అక్కడక్కడా నిచ్చెనల్లాంటివీ ఉంటాయి. 10, 11 శతాబ్దాల కాలంలో ఇక్కడున్న బర్‌బర్‌ జాతి ప్రజలు... కొండను తొలిచి ఇలా నివాసాలుగా మార్చుకున్నారట. ఇప్పుడవే చూడ్డానికి వింతగా అనిపించడంతో- ఈ కొండ పెద్ద పర్యటక ప్రాంతంగా మారిపోయింది. ట్రెకింగ్‌ అంటే ఇష్టపడే సాహసికులు ఎక్కడెక్కడి నుంచో ఈ చోటుకి బారులు తీరతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..