శివోహం... మహా శివాలయం!

మహా లింగమే అక్కడ ప్రవేశ ద్వారం. లోపలికి వెళితే అంతా శివమయమే. బద్రీనాథ్‌, హరిద్వార్‌, రిషికేశ్‌, కేదార్‌నాథ్‌, అమర్‌నాథ్‌... ఇలా దేశంలోని ప్రముఖ ఆలయాల నమూనాల దగ్గర్నుంచి పన్నెండు జ్యోతిర్లింగాల వరకూ శివుడి ప్రసిద్ధ లింగరూపాలన్నింటినీ ఇక్కడ చూడొచ్చు.

Published : 03 Mar 2024 00:37 IST

హా లింగమే అక్కడ ప్రవేశ ద్వారం. లోపలికి వెళితే అంతా శివమయమే. బద్రీనాథ్‌, హరిద్వార్‌, రిషికేశ్‌, కేదార్‌నాథ్‌, అమర్‌నాథ్‌... ఇలా దేశంలోని ప్రముఖ ఆలయాల నమూనాల దగ్గర్నుంచి పన్నెండు జ్యోతిర్లింగాల వరకూ శివుడి ప్రసిద్ధ లింగరూపాలన్నింటినీ ఇక్కడ చూడొచ్చు. అంతేకాదు, ఆఖరున 65 అడుగుల ఎత్తయిన శివుని విగ్రహం భక్తుల్ని మరింతగా ఆకట్టుకుంటుంది. ఇవన్నీ బెంగళూరులోని శివోహం శివాలయం సంగతులు. 1995లో నిర్మించిన ఈ గుడి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. అద్భుతమైన విగ్రహాలూ, అందమైన పరిసరాలతో ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేస్తుంది. లింగరూపంలో నుంచి ప్రవేశించి చుట్టూ తిరుగుతూ కైలాసంలోకి వచ్చామా అన్న అనుభూతిని కల్గించేలా ఉంటాయివన్నీ. ఏడాదంతా పూజలందుకుంటూ భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయం... శివరాత్రి రోజైతే మరింత శోభాయమానంగా వెలిగిపోతుంది!




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..