అందంగా ఆరబెట్టారు!

దూరం నుంచి చూస్తే, ఎర్ర గులాబీల్ని పొడవైన మాలల్లా కట్టారా... పచ్చని ఆకుల్ని పెద్ద పెద్ద దండల్లా వేశారా... అన్నట్టుగా ఉంటాయా... కానీ దగ్గరకు వెళితే అసలు విషయం అర్థమవుతుంది.

Published : 09 Mar 2024 22:50 IST

దూరం నుంచి చూస్తే, ఎర్ర గులాబీల్ని పొడవైన మాలల్లా కట్టారా... పచ్చని ఆకుల్ని పెద్ద పెద్ద దండల్లా వేశారా... అన్నట్టుగా ఉంటాయా... కానీ దగ్గరకు వెళితే అసలు విషయం అర్థమవుతుంది. అవి పువ్వులో, ఆకులో కాదు... క్యాప్సికమ్‌ కూరగాయలని. టర్కీలోని గాజియన్‌టెప్‌ ప్రావెన్సీలో ఎన్నో చోట్ల ఇలా ఎండబెట్టిన క్యాప్సికమ్‌ దండలే కనిపిస్తుంటాయి. దుకాణాల్లో ఈ డ్రైడ్‌ కూరగాయలు వేలాడదీసి ఉంటాయి. అంతేనా... హోటళ్లలోనూ, ఇళ్లలోనూ వీటితో చేసిన బోలెడన్ని వంటకాల్ని రుచి చూడొచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతం డ్రైడ్‌ క్యాప్సికమ్స్‌కి ఫేమస్‌ మరి. ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి చాలామంది గృహిణుల జీవనాధారం ఇదే. రైతుల నుంచి తీసుకొచ్చిన క్యాప్సికమ్‌ రకాల్ని శుభ్రంగా కడిగి, ఒక్కొక్కటిగా దారానికి గుచ్చుతూ పొడవైన దండల్లా చేసి  రెండు వారాల పాటు పూర్తిగా ఎండిపోయేలా ఆరబెడతారు. ఆ తర్వాత వాటిని దుకాణాలకు సరఫరా చేస్తారు. అవడానికి ఇదో పనే అయినా... ఎండబెట్టిన ఈ క్యాప్సికమ్‌ దండలన్నీ చూడ్డానికి భలేగా ఉండటంతో పర్యటకులూ సరదాగా వీటి ఫొటోల్ని ఇలా కెమెరాల్లో బంధిస్తుంటారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..