అందాల గాజు బొమ్మ... కళ్లు చెదరనీయదమ్మా!

టేబుల్‌ మీద పెట్టుకునే పేపర్‌ వెయిట్‌... కేవలం కాగితాలు కదలకుండా ఉంచడానికే కాదు, ఆ టేబుల్‌కే అలంకారంగానూ మారితే ఎలా ఉంటుంది అనుకున్నారేమో కొందరు గ్లాస్‌ ఆర్టిస్టులు

Published : 24 Mar 2024 00:28 IST

టేబుల్‌ మీద పెట్టుకునే పేపర్‌ వెయిట్‌... కేవలం కాగితాలు కదలకుండా ఉంచడానికే కాదు, ఆ టేబుల్‌కే అలంకారంగానూ మారితే ఎలా ఉంటుంది అనుకున్నారేమో కొందరు గ్లాస్‌ ఆర్టిస్టులు- దాన్ని ఓ అద్భుతమైన ఆర్ట్‌పీస్‌గా తీర్చిదిద్దుతున్నారు. రంగు రంగుల పూలు, పచ్చని చెట్లు, ముచ్చటైన జీవులు, ఇంకా ఎన్నెన్నో ప్రకృతి దృశ్యాలూ- ఆ కళాకారుల నైపుణ్యానికి తలవంచుతూ గాజుబంతిలో అందంగా ఒదిగిపోయి చూపరుల్ని చకితుల్ని చేస్తున్నాయి. రంగుల గాజును కరిగించి, అది గట్టిపడకముందే నచ్చిన ఆకృతుల్ని తీర్చిదిద్దుతూ ఈ అందమైన పేపర్‌వెయిట్‌లకి రూపమిస్తున్నారు. చేయాలనుకున్న చిత్రానికి తగ్గట్టుగా ఆ బొమ్మల ఆకారాలు, వాటి అమరిక... అన్నీ సరిగ్గా రావాలంటే అందుకు ఎంతో ఓర్పూనేర్పూ కావాల్సిందే. అందుకే మరి, ఆ కళానైపుణ్యానికి ఫిదా అయిపోతున్నారందరూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..