ఏం అల్లారండీ!

ముద్దొచ్చే పిల్లలు రంగు రంగుల పువ్వుల నడుమ పరుగులు తీస్తున్న చిత్రం ఒకటి... నచ్చిన కార్టూన్‌ పాత్ర మరొకటి... క్యూట్‌ పోజుతో స్టిల్‌ ఇచ్చిన బుజ్జికుక్క ఫొటో ఇంకోటి...

Published : 30 Mar 2024 23:12 IST

ముద్దొచ్చే పిల్లలు రంగు రంగుల పువ్వుల నడుమ పరుగులు తీస్తున్న చిత్రం ఒకటి... నచ్చిన కార్టూన్‌ పాత్ర మరొకటి... క్యూట్‌ పోజుతో స్టిల్‌ ఇచ్చిన బుజ్జికుక్క ఫొటో ఇంకోటి... ఇలా ఒక్కో తివాచీ ఒక్కో అందమైన చిత్రంతో కనువిందుచేస్తోంది కదూ. అదాటున త్రీడీ చిత్రంలా కనిపించే ఈ తివాచీలు ఎలా తయారయ్యాయో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. జపాన్‌లో ప్రసిద్ధి చెందిన క్రోషే ఆర్ట్‌తో రూపుదిద్దుకున్నవే ఇవన్నీ. అదేనండీ... ఊలుతో అల్లిన రగ్స్‌ అన్నమాట. మన దగ్గరా చాలామంది ఊలుతో స్వెటర్లు, చిన్న చిన్న తివాచీలు, అలంకరణ తెరల్లాంటివీ అల్లుతుండటం తెలిసిందే. కానీ జపాన్‌లో మాత్రం కొంతమంది కళాకారులు... ఆ అల్లికల్లోనే అదిరిపోయేలా రంగుల బొమ్మల్నీ చూపిస్తున్నారు. మామూలుగా ఎంతో తీరుగా అల్లిన ఊలు దుస్తుల్ని చూస్తేనే ముచ్చటేస్తుంది, మరి ఆ ఊలుతోనే పెయింటింగ్‌లాంటి చిత్రాల్ని అల్లితే... ఇంకెంత అద్భుతంగా అనిపించాలి. అందుకే మరి, సోషల్‌ మీడియాలో ఉంచిన ఈ ఆర్ట్‌ను చూసినవారంతా ‘గదికే అందాన్ని తెచ్చేలా ఉన్న ఈ తివాచీలు భలే ఉన్నాయే’ అంటూ కళాకారుల్ని పొగడ్తలతో ముంచేస్తున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు