చుట్టూ నీరు... మధ్యలో ఓ ఊరు!

నీటి మధ్యలో పచ్చని చెట్లతో పొందిగ్గా ఉన్న ఆ దీవిలోకి- స్వాగతం పలికే తోవే ప్రకృతి ప్రేమికుల్ని పరవశించేలా చేస్తుంది.

Updated : 07 Apr 2024 05:57 IST

నీటి మధ్యలో పచ్చని చెట్లతో పొందిగ్గా ఉన్న ఆ దీవిలోకి- స్వాగతం పలికే తోవే ప్రకృతి ప్రేమికుల్ని పరవశించేలా చేస్తుంది. అందులో అడుగుపెట్టాక అందమైన పొదరిళ్లలాంటి ఇళ్లూ, పాతకాలం నాటి నిర్మాణాలూ- చూసినవారిని మరింత ముగ్ధుల్ని చేస్తాయి. సావో జసెంటో పేరుతో పిలిచే ఈ దీవి మరెక్కడో లేదు. గోవాలోని జువార నదిలో సముద్రతీరానికి దగ్గర్లో ఉంటుంది.

ప్రకృతి ఒడిలో పుట్టినట్టుగా ఉండే ఈ దీవి, ఇదివరకు పోర్చుగీసు వాళ్లకు నివాసంగా ఉండేది. అందుకే ఆనాటి వాస్తు నైపుణ్యాల్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి దీవిలోని భవనాలన్నీ. ఇప్పటికీ ఈ ఊళ్లోని స్థలాల్ని బయటివాళ్లకు అమ్మరు, ఇళ్ళను అద్దెకివ్వరు. ఇంచుమించు 200 ఇళ్లు, వందల ఏళ్లనాటి చర్చితో ఉండే ఈ దీవి మంచి పర్యటక ప్రాంతం. గోవాలోని సముద్రతీరాలతో పాటూ నీళ్లలో పాతకాలం నాటి కట్టడాలతో ఉండే ఈ ఊరినీ చూడ్డానికి సందర్శకులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. దీవి చుట్టూ సరదాగా పడవల్లో షికారు కొడుతూ స్థానిక వంటల్ని ఆస్వాదిస్తుంటారట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..