పూసల్లో ఏమి ‘చిత్రం’!

పూసలతో ఎంబ్రాయిడరీ వర్కు చేయడమే ఒక కళ. మరి అదే పూసలు గుచ్చుతూ ఒక మనిషి ముఖాన్ని తీర్చిదిద్దితే... ఆ రంగుల పూసల్లోనే ఎన్నో హావభావాల్నీ పలికిస్తే... దాన్ని ఇంకెంత గొప్పకళగా చెప్పాలి!

Published : 27 Apr 2024 23:38 IST

పూసలతో ఎంబ్రాయిడరీ వర్కు చేయడమే ఒక కళ. మరి అదే పూసలు గుచ్చుతూ ఒక మనిషి ముఖాన్ని తీర్చిదిద్దితే... ఆ రంగుల పూసల్లోనే ఎన్నో హావభావాల్నీ పలికిస్తే... దాన్ని ఇంకెంత గొప్పకళగా చెప్పాలి! తమ ఆర్ట్‌తో అందరిలో గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న కొందరు కళాకారులు... ఇదిగో ఇక్కడున్న ‘బీడెడ్‌ పోర్ట్రెయిట్స్‌’ని తయారుచేశారు. పూసల్ని తీరుగా గుచ్చుతూ పువ్వుల్నీ, ఆకుల్నీ కుట్టడమే అందరికీ చేత కాదు. అలాంటిది పూసల్నే ఇలా అందమైన అమ్మాయి ముఖంలా, ఆశ్చర్యపోయే బాబు రూపంగా, అలనాటి రాణి చిత్రంగా మార్చేశారు. ఇంకా ఎందరో ప్రముఖుల ముఖాల్నీ పూసలతో అచ్చుగుద్దినట్లు దింపేశారు. ముందుగా బొమ్మ ఆకారాన్ని గీసుకుని దానిపైన జుట్టూ, కళ్లూ, చర్మమూ, డ్రెస్సు రంగులకు తగ్గట్టు ఆయా రంగుల బీడ్స్‌ను తీసుకుని ఈ పూసల చిత్రాల్ని గుచ్చేస్తారు. వీటిల్లో అనుకున్న బొమ్మల ముఖాలు సేమ్‌ టూ సేమ్‌ దిగిపోవడంతో... చూసినవాళ్లంతా ఒకవైపు ఆశ్చర్యపోతూనే మరోవైపు ‘పూసల చిత్రాలు భళా’ అంటూ కళాకారుల్ని అభినందించేస్తున్నారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..