ఆకాశంలో... స్వింగ్‌ జరా!

ఎత్తయిన పర్వతాల మధ్యలో పొడవైన తాడుకు ఊయల కట్టి అందులో పడుకుంటే ఎలా ఉంటుంది... బాబోయ్‌ ఆ ఊహే కడుపులో భయం పుట్టిస్తుంది కదూ. కానీ నిజంగానే అలా చేసే సాహసికులున్నారు మరి.

Updated : 19 May 2024 15:29 IST

త్తయిన పర్వతాల మధ్యలో పొడవైన తాడుకు ఊయల కట్టి అందులో పడుకుంటే ఎలా ఉంటుంది... బాబోయ్‌ ఆ ఊహే కడుపులో భయం పుట్టిస్తుంది కదూ. కానీ నిజంగానే అలా చేసే సాహసికులున్నారు మరి. ఇటలీలోని మాంటీ పియనా పర్వతాల్లో ‘ఇంటర్నేషనల్‌ హైలైన్‌ మీటింగ్‌’ పేరుతో ఏటా ప్రపంచంలోని డేర్‌డెవిల్స్‌ ఈ స్కైక్యాంపింగ్‌ను ఏర్పాటు చేసుకుంటారు. వందలాది అడుగుల ఎత్తులో, రెండు పర్వతాల నడుమ, పొడవైన తాడు బిగించి, దానికి వరసగా ఉయ్యాలలు కట్టుకుంటారు. అంత ఎత్తుకి ధైర్యంగా చేరుకోవడమే కాదు... సరదాగా పాటలు పాడుతూ, గిటారు వాయిస్తూ, పుస్తకాలు చదువుతూ నచ్చిన పనులతో కాలక్షేపం చేస్తారు. అదంతా సరే, మరి జారిపడితే ఎలా అంటారా... ఆ భయం లేకుండా సేఫ్టీ బెల్టుల్లాంటివి వేసుకుంటారు. ఎంత రక్షణ ఏర్పాట్లు చేసుకున్నా... చూస్తేనే ఒళ్లు గగుర్పొడిచేలా ఆకాశంలో ఊయల ఊగడమంటే నిజంగా పెద్ద సాహసమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు