నోరూరించే... ఎంబ్రాయిడరీ

కొబ్బరిచిప్ప, బర్గర్‌, ఐస్‌క్రీం, బిస్కెట్‌, కేకు ముక్క... ఇలా ఇక్కడున్న చిత్రాలన్నీ త్రీడీ ఎంబ్రాయిడరీతో కుట్టినవే.

Published : 25 May 2024 23:16 IST

కొబ్బరిచిప్ప, బర్గర్‌, ఐస్‌క్రీం, బిస్కెట్‌, కేకు ముక్క... ఇలా ఇక్కడున్న చిత్రాలన్నీ త్రీడీ ఎంబ్రాయిడరీతో కుట్టినవే. ‘అవునా’ అంటూ మీరు కళ్లు ఇంతలు చేసి సందేహంగా చూసినా... నిజమేనండీ బాబూ. కళ ఏదైనా కానీ అందులో ఒక అద్భుతాన్ని సృష్టించాలి అనుకున్న ఎంబ్రాయిడరీ ఆర్టిస్టు యుమెంగ్‌ లియూ కుట్టినవే ఇవన్నీ. కుట్లూఅల్లికలతో అందాల చిత్రాలకు రూపమిచ్చే వాళ్లు చాలామందే ఉంటారు. కానీ అనుకున్న బొమ్మను- అచ్చం ఆ వస్తువే అక్కడుందా అని భ్రమించేట్లుగా- త్రీడీ ఆకారంలో తీసుకొస్తే ఆ మజానే వేరబ్బా అనుకుంటూ ఎంబ్రాయిడరీలోనే తీరొక్క ఆహార పదార్థాల్ని చొప్పించేస్తోంది. ముందుగా క్లాత్‌పైన కావాలనుకున్న బొమ్మ రూపాన్ని గీసుకుని దానికి సరిపోయే దారాల్నే వాడుతూ ఎంబ్రాయిడరీతో త్రీడీ లుక్కుని తీసుకొచ్చేస్తుంది. రంగుల దారాలతో ప్రకృతి దృశ్యాల్ని తేవడమేమో కానీ తినే పదార్థాల రంగుల్నీ సేమ్‌ టూ సేమ్‌ దించేయడమంటే మాటలా... అందుకే మరి, సోషల్‌ మీడియాలో ఈ కళాకారిణి ఆర్ట్‌ చిత్రాలూ, వీడియోలూ చూసి ఫిదా అవుతున్నారందరూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..