ఈ కుక్క ఆస్తి రూ.3500 కోట్లు!

సంపన్నుల ఇళ్లలో దర్జాగా బతికే కుక్కలను చూస్తుంటాం. ఖరీదైన వాటి గురించీ వింటుంటాం. వాటన్నింటికీ మించిన భోగాలను అనుభవిస్తున్న శునకం గురించి తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది.

Published : 09 Jun 2024 00:29 IST

సంపన్నుల ఇళ్లలో దర్జాగా బతికే కుక్కలను చూస్తుంటాం. ఖరీదైన వాటి గురించీ వింటుంటాం. వాటన్నింటికీ మించిన భోగాలను అనుభవిస్తున్న శునకం గురించి తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. అదే దాదాపు రూ.3500 కోట్లకు అధిపతి అయిన గుంథర్‌-6. ప్రపంచంలోనే సంపన్న శునకమైన గుంథర్‌-6 నిద్రలేచింది మొదలు- దానిచుట్టూ పరిచారికలు చేరి బాగోగులు చూసుకుంటారు. పూటకో వెరైటీ చేసి పెట్టడానికి ఓ షెఫ్‌ ఉంటాడు. ఆటలాడించడానికీ, మార్నింగ్‌ వాక్‌కీ, హోటళ్లకీ తీసుకెళ్లడానికీ- దానికున్న ప్రత్యేక విమానంలోనూ, క్రూయిజ్‌లోనూ తిప్పడానికీ ప్రత్యేకంగా సిబ్బందీ ఉన్నారు. ఈ జర్మన్‌ షెపర్డ్‌ జాతి కుక్క మీద నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘గుంథర్స్‌ మిలియన్‌’తో ఇది వరల్డ్‌ ఫేమస్‌ అయిపోయింది. ఇంతకీ ఆ కుక్కకి అంత ఆస్తి ఎలా వచ్చిందంటే... జర్మనీకి చెందిన ఓ రాణి చనిపోతూ గుంథర్‌-3కి తన ఆస్తిని రాసిచ్చి- ఇటలీకి చెందిన వ్యాపారవేత్త మౌరిజియో మియాన్‌కి దాని బాధ్యతల్ని అప్పగించింది. దాదాపు ముప్ఫైగేళ్లుగా మియాన్‌ గుంథర్‌ వారసులను సంరక్షిస్తూ వస్తున్నాడు. ఒకప్పుడు పాప్‌ సింగర్‌ మడోన్నా నివాసమున్న భవనాన్ని సొంతం చేసుకుని తాజాగా వార్తల్లోకి వచ్చిన గుంథర్‌-6 ప్రస్తుతం తన ముత్తాత ఆస్తిని అనుభవిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు