బొమ్మరిల్లు

ఆడుకోవడానికి పిల్లలు బొమ్మరిళ్లు కట్టుకోవడం మనకు తెలిసిందే. అదే బొమ్మలతో ఇల్లు కట్టడం ఎక్కడైనా చూశారా... కేరళలోని వడకర వెళితే ఆ బొమ్మల ఇంటిని మనమూ చూసేయొచ్చు.

Published : 09 Jun 2024 00:33 IST

ఆడుకోవడానికి పిల్లలు బొమ్మరిళ్లు కట్టుకోవడం మనకు తెలిసిందే. అదే బొమ్మలతో ఇల్లు కట్టడం ఎక్కడైనా చూశారా... కేరళలోని వడకర వెళితే ఆ బొమ్మల ఇంటిని మనమూ చూసేయొచ్చు. సంతోష్‌ అనే రైతు ఈ మధ్య తన పొలంలో కట్టించుకున్న ఈ బొమ్మల ఇల్లు- పర్యావరణవేత్తల మెప్పు పొందడంతోపాటు అతడికి ప్రత్యేక గుర్తింపునీ తెచ్చి పెట్టింది. సాధారణంగా పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనూ ఆటబొమ్మలుంటాయి. అవి ప్లాస్టిక్‌తో చేసినవి కావడంతో పర్యావరణానికి ఎంతో హాని చేస్తాయి. అలాంటి దాదాపు ఏడువేల బొమ్మల్ని సేకరించి ఇల్లు కట్టించుకున్నాడు వడకర వాసి సంతోష్‌. బెడ్‌ రూమ్‌, విశాలమైన హాల్‌ ఉన్న ఆ ఇంటి కింది భాగంలో ఓ లైబ్రరీనీ ఏర్పాటు చేసి గ్రామస్థులంతా కమ్యూనిటీ హాల్‌గా వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశాడు. కొబ్బరితోట మధ్యలో కట్టించిన ఆ ఇల్లు ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల పిల్లలకు సందర్శనీయ స్థలమైంది. తాము వాడుకున్న బొమ్మల్ని చూడ్డానికి పెద్ద ఎత్తున వస్తున్నారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..