సంవత్సరాదికి... సరికొత్తగా!
కొత్త సంవత్సరాది నాడు షడ్రుచుల పచ్చడి ఎలాగూ ఉంటుంది. దాంతోపాటూ పులిహోరా, పాయసం లాంటివాటిని ఎప్పటిలా కాకుండా... ఇలాంటి రుచుల్లో వండుకోవచ్చేమో చూడండోసారి.
బెల్లం సొజ్జప్పాలు
కావలసినవి: బొంబాయిరవ్వ: పావుకప్పు, మైదా: కప్పు, పసుపు: పావుచెంచా, ఉప్పు: పావుచెంచా, తాజా కొబ్బరి ముద్ద: కప్పు, బెల్లం తరుగు: ముప్పావుకప్పు, యాలకులపొడి: అరచెంచా, గసగసాలు: రెండు టేబుల్‌స్పూన్లు, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీవిధానం: ఓ గిన్నెలో బొంబాయిరవ్వ, మైదా, పసుపు, ఉప్పు, రెండు టేబుల్‌స్పూన్ల వేడినూనె వేసి కలపాలి. ఇందులో నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా చేసుకుని... పైన మరో చెంచా నూనె వేసి కలిపి మూత పెట్టాలి. ఇప్పుడు స్టౌమీద కడాయిని పెట్టి పావుకప్పు నీళ్లు, బెల్లం తరుగు వేయాలి. బెల్లం కరిగాక తాజా కొబ్బరి ముద్ద, గసగసాలు, యాలకులపొడి వేసి కలిపి స్టౌని సిమ్‌లో పెట్టి... ఈ మిశ్రమం దగ్గరకు అవుతున్నప్పుడు దింపేయాలి. ఇప్పుడు నిమ్మకాయంత మైదా పిండిని తీసుకుని చిన్నగా ఒత్తి... అందులో కొద్దిగా కొబ్బరిమిశ్రమాన్ని ఉంచి... అంచుల్ని మూసి పూరీలా ఒత్తుకోవాలి. ఇలా మిగిలిన మిశ్రమాన్నీ చేసుకుని రెండు చొప్పున కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.
మామిడికాయ పులియోదరై
కావలసినవి: బియ్యం: రెండు కప్పులు, మామిడికాయ తురుము: కప్పు, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, పల్లీలు: పావుకప్పు, ఆవాలు: చెంచా, ఇంగువ: చిటికెడు, ఉప్పు: తగినంత, సెనగపప్పు: చెంచా, మినప్పప్పు: చెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు.
మసాలా కోసం: దనియాలు: అరటేబుల్‌స్పూను, మిరియాలు: చెంచా, మినప్పప్పు: చెంచా, సెనగపప్పు: చెంచా, ఎండుమిర్చి: ఎనిమిది, ఎండుకొబ్బరిపొడి: టేబుల్‌స్పూను, మెంతులు: పావుచెంచా.
తయారీ విధానం: ముందుగా స్టౌమీద కడాయిని పెట్టి... మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలను ఒక్కొక్కటిగా వేయించుకుని ఆ తరువాత అన్నీ కలిపి మెత్తగా పొడిచేసుకుని పెట్టుకోవాలి. బియ్యాన్ని కడిగి మూడున్నర కప్పుల నీళ్లు పోసి పొడిపొడిగా అన్నం వండి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేయించుకోవాలి. తరువాత ఇంగువ, కరివేపాకు, మామిడికాయ తురుము, తగినంత ఉప్పు కూడా వేసి వేయించుకుని రెండు నిమిషాలయ్యాక స్టౌని కట్టేయాలి. ఈ తాలింపుతో పాటు రెండు చెంచాల మసాలాపొడిని అన్నంపైన వేసి అన్నింటినీ కలిపితే చాలు.
కొబ్బరి పాయసం
కావలసినవి: బియ్యం: టేబుల్‌స్పూను, తాజా కొబ్బరి ముద్ద: ఒకటిన్నర కప్పు, చిక్కని పాలు: లీటరు, జీడిపప్పు పలుకులు: పావుకప్పు, యాలకులపొడి: అరచెంచా, నెయ్యి: రెండు చెంచాలు, కండెన్స్‌డ్‌మిల్క్: పావుకప్పు, చక్కెర: అరకప్పు.
తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని మిక్సీలో రవ్వలా వచ్చేలా చేసుకోవాలి. స్టౌమీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక బియ్యపు రవ్వ, జీడిపప్పును వేయించుకుని స్టౌని సిమ్‌లో పెట్టాలి. ఇప్పుడు కొబ్బరిముద్దను వేసి రెండు నిమిషాలు వేయించుకుని పాలు పోయాలి. పాలు మరుగుతున్నప్పుడు యాలకులపొడి, చక్కెర వేసి మధ్యమధ్య కలుపుతూ ఉండాలి. చక్కెర
కరిగి పాలు సగం అవుతున్నప్పుడు కండెన్స్‌డ్‌మిల్క్ వేసి కలిపాలి. పాయసం చిక్కగా అయ్యాక దింపేయాలి.
చల్ల గారెలు
కావలసినవి: అటుకులు: రెండు కప్పులు, పచ్చిమిర్చి: నాలుగు, అల్లం: చిన్నముక్క, జీలకర్ర: చెంచా, కొత్తిమీర తరుగు: పావుకప్పు, పెరుగు: ఒకటింబావు కప్పు, ఉప్పు: తగినంత, బియ్యప్పిండి: మూడు టేబుల్‌స్పూన్లు, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీ విధానం: అటుకుల్ని ఓ గిన్నెలో వేసి అవి మునిగేలా నీళ్లు పోయాలి. అయిదు నిమిషాలయ్యాక ఆ నీటిని పూర్తిగా పిండేసి అటుకుల్ని మరో గిన్నెలో వేసుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అయిదు నిమిషాలు నాననిచ్చి ఆ తరువాత చిన్నచిన్న గారెల్లా చేసుకుంటూ కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
General News
Viral: ప్రొజెక్టర్ స్క్రీన్‌గా బెడ్‌షీట్.. ఇది కదా వాడకమంటే..!
-
Movies News
94 ఏళ్ల వయసులో మళ్లీ కెమెరా ముందుకు
-
World News
Taliban: బంధుప్రీతిపై తాలిబన్ల కన్నెర్ర..!
-
India News
Shocking: షాకింగ్.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రభుత్వ ఉద్యోగి మృతి!
-
World News
Japan: చైనాకు చెక్ పెట్టేలా.. రూ.6 లక్షల కోట్లతో భారీ ప్రణాళిక!
-
Sports News
Virender Sehwag: టీమ్ఇండియా కోచింగ్ ఆఫర్.. నాకు ఆ అవకాశం రాలేదు!:సెహ్వాగ్