Weekly Horoscope: రాశిఫలం (మార్చి 10 - 16)

ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 10 Mar 2024 00:20 IST

 


అదృష్టయోగముంది. శ్రేష్ఠమైన ఫలితాలు సాధిస్తారు. ఆశించిన విజయం అందుకుంటారు. ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. తోటివారి ప్రోత్సాహం ఉంటుంది. లక్ష్యసాధనలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. భూ గృహ వాహనాది యోగాలు సానుకూలం. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. పెట్టుబడులు లాభిస్తాయి. ఇష్టదైవస్మరణ శక్తినిస్తుంది.


లక్ష్యాన్ని సాధిస్తారు. వృత్తిఉద్యోగాల్లో బ్రహ్మాండ మైన ఫలితాలున్నాయి. సమయానుకూలంగా వ్యవహరించి పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు. ఇంటాబయటా కలిసివస్తుంది. శత్రుదోషం తొలగుతుంది. మిత్రబలం పెరుగుతుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారంలో విశేష ధనలాభముంది. ఇష్టదైవాన్ని దర్శించండి, ఒక ఉపద్రవం నుంచి బయటపడతారు.


బాధ్యతగా పనిచేయండి. ఒత్తిడి కలిగించే సంఘటనలున్నాయి. చెడు ఆలోచించవద్దు. కుటుంబసభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు సఫలమవుతాయి. నూతన పరిచయాలు ఇబ్బంది కలిగిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. పరిస్థితులు సహకరించడం లేదు కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో తగిన శ్రద్ధ వహించాలి. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభవార్త వింటారు.


ఆర్థిక విషయాలు అనుకూలం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అందుకు తగినంత కృషి అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ వహించవద్దు. గ్రహబలం తక్కువగా ఉన్నందున మానవప్రయత్నం బలంగా చేయాలి. అపార్థాలకు అవకాశం ఉంది. నలుగురినీ కలుపుకుని పోవాలి. అనుకున్నది సాధించే వరకు ఓపిగ్గా పనిచేయాలి. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మంచిది.


మానసిక దృఢత్వం ధైర్యాన్నిస్తుంది. ప్రతి విషయం లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొందరివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి కలహాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. మిత్రుల వల్ల కొన్ని పనులు పూర్తవుతాయి. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరిస్తే మేలు.


ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. అంతా మీరు అనుకున్న విధంగానే జరుగుతుంది. ప్రతిభతో ప్రశంసలు అందుకుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక విజయం సాధించేవరకు కృషిచేస్తూనే ఉండాలి. చంచలత్వం పనికిరాదు. ఇంట్లోవారితో చర్చించి పనులు చేయాలి. ఎవరికైనా ధనం ఇస్తే తిరిగిరాదు. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభవార్త వింటారు.


వ్యాపారయోగం బ్రహ్మాండంగా ఉంది. నూతన ప్రయత్నాలు కలిసివస్తాయి. అంచెలంచెలుగా పైకి వస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. నూతన ఆదాయ మార్గాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మేలుచేస్తాయి. ఉద్యోగంలో తోటివారితో సున్నితంగా వ్యవహరించాలి. ఇష్టదేవతను స్మరించండి, కార్యసిద్ధి లభిస్తుంది.


సకాలంలో పనులు పూర్తిచేస్తే సత్ఫలితాలుంటాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అమలుచేయండి. పనులను మధ్యలో ఆపవద్దు. ఎదురుచూస్తున్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి. చెడు ఆలోచనలు చేయవద్దు. నిరుత్సాహం పనికిరాదు. క్రమంగా కాలం సహకరిస్తుంది. కుటుంబసభ్యుల సలహాలు పాటించాలి. ఇష్టదైవాన్ని స్మరించండి, మనోధైర్యం లభిస్తుంది.  


అద్భుతమైన శుభకాలం. ఎటుచూసినా విజయమే గోచరిస్తోంది. అవసరాలను దృష్టిలో పెట్టుకోండి, కృషికి తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారంలో పైకి వస్తారు. పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. జీవితాశయాలు నెరవేరుతాయి. ధన ధాన్యాభివృద్ధి ఉంది. లక్ష్మీదేవిని స్మరించండి, మంచివార్త వింటారు.


ధనయోగముంది. కృషి ఫలిస్తుంది. ఆశించిన ఆర్థికస్థితి లభిస్తుంది. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా సాంకేతికమైన అభివృద్ధిని సాధించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ వహించాలి. పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. తోటివారి సహకారంతో సకాలంలో పని పూర్తిచేయండి. కుటుంబసభ్యుల సహకారం అవసరం. నవగ్రహశ్లోకాలు చదువుకోండి, మేలు జరుగుతుంది.


మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార పరంగా అభివృద్ధిని సాధిస్తారు. రుణసమస్యలు తొలగుతాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ముఖ్య విషయాల్లో విజయం లభిస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సంతృప్తినిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో సమయానుకూలంగా వ్యవహరించాలి. ఒక పని పూర్తవుతుంది. శత్రుపీడ తొలగుతుంది. ఇష్టదైవస్మరణ శుభప్రదం.


ముఖ్యకార్యాల్లో విజయం లభిస్తుంది. తెలియని ఆటంకాలున్నాయి, బుద్ధిబలంతో వ్యవహరించండి. గ్రహదోషం ఉంది. సకాలంలో పనులు పూర్తిచేస్తే మంచిది. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. చంచలత్వం పనికిరాదు. మీకోసం మీరు ఆలోచించుకోవాలి. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..