Weekly Horoscope: రాశిఫలం (మార్చి 31 - ఏప్రిల్‌ 6)

ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 02 Apr 2024 17:19 IST


గ్రహబలం అనుకూలం. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తుని ఇస్తాయి. మీవల్ల చాలామందికి మేలు జరుగుతుంది. పలు మార్గాల్లో ధనయోగం సూచితం. అవకాశాల కోసం ఎదురుచూడకుండా పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. సమష్టి నిర్ణయాలు విజయాన్నిస్తాయి. ఇష్టదైవాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది.


గ్రహస్థితిలో మార్పు లేదు. ప్రయత్నాన్ని బట్టి ఫలితాలుంటాయి. ఉత్సాహంగా కృషిచేయండి, ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇతరుల వల్ల ఆవేశపరిచే సన్నివేశాలు ఉంటాయి. మనో బలంతో ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఉద్యోగంలో ప్రతిభతో మెప్పిస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. ఆత్మీయుల సూచనలు అవసరం. ఇష్టదేవతను స్మరిస్తే మంచిది.


శుభప్రదమైన కాలం. పలుమార్గాల్లో విజయం గోచరిస్తోంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. వృత్తి ఉద్యోగాల్లో మేలు కలుగుతుంది. మీ ప్రతిభను గుర్తిస్తారు. పోయినవి తిరిగి లభిస్తాయి. ప్రశాంతత పెరుగుతుంది. సరైన ప్రణాళికతో ఆశయాలకు కార్యరూపమివ్వాలి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. సాహసోపేత నిర్ణయాలు పనికిరావు. అష్టలక్ష్మీధ్యానం శుభప్రదం.


ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ప్రతి అవకాశాన్నీ సద్వినియోగపర్చుకోండి. పనులు వాయిదా వేయవద్దు. భవిష్యత్తు బాగుంటుంది. సాధించాలనుకుంటున్నదానికి తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఎవరి మాటలూ మనసుకు తీసుకోవద్దు. ఏ విషయమూ లోతుగా ఆలోచించవద్దు. ఏకాగ్రతతో ఆటంకాలను అధిగమిస్తూ భవిష్యత్తుపై దృష్టి నిలపాలి. నవగ్రహస్తోత్రం మంచిది.


మనోబలంతో పనులు ప్రారంభించాలి. గ్రహదోషం అధికంగా ఉంది. సరైన ఆలోచనావిధానంతో విఘ్నాలను అధిగమించవచ్చు. దేనికీ భయపడవద్దు. కుటుంబ సభ్యులతో కలిసి కార్యాచరణను రూపొందించుకోవాలి. ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒక మెట్టు దిగైనా పనులు చక్కబెట్టుకోవాలి. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మంచిది.


చిత్తశుద్ధితో ముందుకెళ్లండి. ఇతరుల కోసం పనిచేయవద్దు. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్నిస్తాయి. ధర్మాన్ని వీడవద్దు. న్యాయపరమైన విజయం ఉంది. మానసిక ఒత్తిడి లేకుండా ఆలోచించి పనులు చక్కబెట్టాలి.పూర్వ పుణ్యం మిమ్మల్ని కాపాడుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్త. రోజూ నవగ్రహశ్లోకాలు చదివితే మేలు.


అద్భుతమైన ఫలితాలు సాధించడానికి అనుకూలమైన సమయం. సరైన మార్గంలో ప్రయత్నం చేయండి. అధిక గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి నిమిషం అభివృద్ధికై వినియోగించండి. భూ గృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. మహాలక్ష్మీదేవిని ధ్యానిస్తే మేలు.


శుభఫలితాలున్నాయి. ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి యోగ్యమైన కాలం. ధర్మబద్ధంగా ముందుకెళ్లండి, కోరుకున్న విజయం లభిస్తుంది. సకాలంలో పనులు పూర్తిచేస్తే ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ఓర్పుతో మాట్లాడాలి. ఇతరుల విషయాల్లో ఆచితూచి స్పందించండి. పెద్దల సూచనలు అవసరం. ఈశ్వరారాధన శ్రేయస్సును పెంచుతుంది.


అదృష్ట యోగం సూచితం. గ్రహబలం ఉన్నతుల్ని చేస్తుంది. బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని కొనసాగండి. స్వల్పప్రయత్నంతోనే అద్భుతమైన విజయం లభిస్తుంది. మంచి పనులకే కాలాన్ని వినియోగించాలి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తును ఇస్తాయి. ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారలాభాలున్నాయి. ధనలక్ష్మీధ్యానం శుభప్రదం.


లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. ప్రయత్నాన్ని కొనసాగించండి. నూతన ప్రణాళికలు అవసరం. ఉద్యోగంలో శుభయోగాలున్నాయి. తోటివారిని కలుపుకుని పోవాలి. కొత్త పరిచయాలు మనోబలాన్నిస్తాయి. వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడాలి. మొహమాటంతో ఎవరికైనా ధనం ఇస్తే తిరిగి రాదు. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది.


విశేషమైన ధనలాభాలుంటాయి. ఆదాయమార్గాలు పెరుగుతాయి. నిరంతర సాధనతో ఉన్నత స్థితి సాధిస్తారు. స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు ఊహించవద్దు. చంచల నిర్ణయాలు లేకుండా పనిచేయండి. ఎవరేమన్నా పట్టించుకోవద్దు. వివాదాలకు పోవద్దు. సున్నితంగా వ్యవహరించండి. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభవార్త వింటారు.


మనోబలంతో నిర్ణయాలను అమలు చేయండి. ముందస్తు ప్రణాళికలతో ఆపదలు తొలగుతాయి. స్పష్టంగా మాట్లాడాలి. అపార్థాలకు అవకాశం లేకుండా స్పందించాలి. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగించవచ్చు. ఏదీ మనసుకు తీసుకోవద్దు. ఉద్యోగంలో కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉన్నత పురస్కారాలు అందుకుంటారు. నవగ్రహస్తోత్రం పఠించండి, శుభవార్త వింటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..