Weekly Horoscope: రాశిఫలం (జూన్‌ 9 - 15)

ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 09 Jun 2024 01:07 IST


ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అదృష్టం వరిస్తుంది. లక్ష్యసాధనకు అనుకూల సమయం. మనోబలం ముందుకు నడిపిస్తుంది. జిజ్ఞాస పెంచుకుంటారు. కొత్త ఆవిష్కరణలు చేస్తారు. ధనయోగం ఉంది. కుటుంబపరంగా అభివృద్ధి సూచితం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది. వారాంతంలో మంచి జరుగుతుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించాలి.


ఆర్థిక వృద్ధి సూచితం. మొహమాటం వల్ల డబ్బు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. తగిన జాగ్రత్త తీసుకోండి. లక్ష్యాల వైపు దృష్టి మళ్లించండి. కాలాన్ని వృథా చేయకండి. కొన్ని ఆటంకాలు వస్తాయి. సమయస్ఫూర్తి అవసరం. పరిస్థితులను అర్థంచేసుకుంటూ ముందుకు సాగండి. వ్యాపారంలో సమస్యలకు ఆస్కారం లేకపోలేదు. నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి.


మనోబలంతో పనులు మొదలుపెట్టండి. విజయానికి చేరువ అవుతారు. మీ నిర్ణయాలను త్రికరణశుద్ధిగా అమలుచేయండి. ఉద్యోగంలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగాలి. మానసిక ప్రశాంతత ముఖ్యం. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఆత్మబలాన్ని నమ్ముకోండి. నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి.


వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనలాభం సూచితం. ఆత్మీయుల ప్రోత్సాహం, సహకారం లభిస్తాయి. ధర్మదేవత మీకు అండగా నిలుస్తుంది. సృజనాత్మక ఆలోచనతో భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలున్నాయి. పురస్కారాలు లభిస్తాయి. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. లక్ష్మీదేవిని ధ్యానించండి.


వ్యాపారంలో మంచి ఫలితాలు ఉన్నాయి. ధనలాభం సూచితం. ఆత్మీయుల ప్రోత్సాహం, సహకారం లభిస్తాయి. కొత్త ఆలోచనతో భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతి సూచితం. పురస్కారాలు లభిస్తాయి. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. ఎంతగానో ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. లక్ష్మీదేవిని ధ్యానించండి.


శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సరైన ప్రణాళికతో విజయాలు సాధిస్తారు. మనోబలం ముందుకు నడిపిస్తుంది. సంక్లిష్ట పరిస్థితుల్లోనూ న్యాయబద్ధంగా వ్యవహరించండి. పెట్టుబడులపై దృష్టి సారించాల్సిన సమయం. ఇతరుల చర్యలు మీ మనసుకు కష్టం కలిగిస్తాయి. ఓరిమితో వాటిని అధిగమిస్తారు. సూర్యనారాయణ మూర్తిని ధ్యానించండి.


తక్షణ అవసరాలకు ఆర్థిక సాయం అందుతుంది. దీర్ఘకాలిక లక్ష్యాన్ని సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఓపిక అవసరం. గ్రహదోషం అధికం. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయండి. అనవసర సంభాషణలు వద్దు. దుబారా ఖర్చులకు దూరంగా ఉండండి. కీలక నిర్ణయాల్లో ఆత్మీయులను భాగస్వాములను చేయండి. నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి.


స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంకల్పం సిద్ధిస్తుంది. ఉద్యోగులకు మిశ్రమ కాలం. కొన్ని విషయాల్లో అస్థిరత తొలగుతుంది. ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేయకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దు. ఆశలు వదులుకున్న ఓ పని నిర్విఘ్నంగా పూర్తవుతుంది. శత్రువులు మంచి మిత్రులు అవుతారు. విష్ణు సహస్రనామం చదువుకోవాలి.


అన్నివిధాలా శుభ సమయం. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు మంచి జరుగుతుంది. పెద్దల ప్రశంసలు అందుతాయి. వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తెలివితేటలే మీ పెట్టుబడి. వ్యయాలను తగ్గించుకోవడం మేలు. నలుగురికీ సాయపడతారు. కుటుంబ ప్రోత్సాహం అందుతుంది. లక్ష్మీదేవిని ధ్యానించండి.


మనోబలంతో పనులు ప్రారంభిస్తారు అభీష్టం సిద్ధిస్తుంది. ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఏదీ లోతుగా ఆలోచించొద్దు. అవసరానికి డబ్బు అందుతుంది. గృహ, వాహన యోగాలు సూచితం. పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగ బాధ్యతల్ని నిర్లక్ష్యం చేయకండి. అధికారుల సహకారం లభిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.


ఉద్యోగ ఫలితాలు శుభప్రదం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. కార్యాలయంలో తగిన గుర్తింపు లభిస్తుంది. గతంతో పోలిస్తే మేలైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారం లాభదాయకం. లక్ష్యాలు నెరవేరుతాయి. రుణ విముక్తులు అవుతారు. ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆ ప్రయత్నంలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. ఇష్టదైవాన్ని స్మరించండి.


వృత్తి ఉద్యోగాల్లో విజయాలు సాధిస్తారు. ఏ పని చేపట్టినా నలుగురి సహకారమూ అందుతుంది. ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. భూ, గృహ యోగాలున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపుగా అడుగులు వేస్తారు. కుటుంబ బంధాలు బలపడతాయి. పనులు వాయిదా వేయకండి. వివాదాలకు దూరంగా ఉండండి. నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..