సిల్లీపాయింట్‌

మిమోసా... చిన్నచిన్న రేకలతో పసుపుపచ్చగా ఉండే పూలు, రోమ్‌లో ఎక్కువగా పూస్తాయివి.

Published : 09 Mar 2024 23:43 IST

మిమోసా... చిన్నచిన్న రేకలతో పసుపుపచ్చగా ఉండే పూలు, రోమ్‌లో ఎక్కువగా పూస్తాయివి. మహిళాదినోత్సవం రోజు మగవాళ్ళు తమ జీవితంలోని అతివలకు వీటిని అందించాలన్న ఆనవాయితీ ఉందక్కడ.

 • భార్యాభర్తల మధ్య వాదులాటకు కారణమయ్యే అంశాల్లో మొట్టమొదటిది... డబ్బు.
 • చీమలు 12 గంటలకోసారి ఎనిమిది నిమిషాలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటాయి.
 • వికీపీడియా కంటే ఐదురెట్లు ఎక్కువ సమాచారాన్ని మెదడు నిల్వ చేసుకోగలదు.
 • నీలం రంగును చూడగలిగే ఒకే ఒక పక్షి... గుడ్లగూబ.
 • తేనెటీగలు ఇరవై లక్షల పువ్వుల్లోని మకరందాన్ని సేకరిస్తే... అరకిలో తేనె అవుతుంది.
 • మనుషులు నిద్ర లేకుండా పదకొండు రోజులకు మించి ఉండలేరు.
 • మన శరీరంపైన పచ్చగా కనిపించే సిరలకి... నిజానికి ఏ రంగూ ఉండదు. వాటిలోపలి రక్తప్రవాహం కారణంగానే అలా పచ్చగా కనిపిస్తాయి.
 • మనదగ్గర ఎక్కువగా ఉండదు కానీ- ప్రపంచవ్యాప్తంగా ‘వైట్‌చాక్లెట్‌’ వాడకం ఎక్కువ. మొత్తం చాక్లెట్‌లలో 10 శాతం ఇవే ఉంటాయట.
 • మెనోపాజ్‌... మనుషులూ, తిమింగలాల్లో మాత్రమే ఉంటుంది.

న శరీరంలో క్యాన్సర్‌ ప్రమాదం అతి తక్కువగా ఉన్న ఏకైక అవయవం... హృదయమే!

 • అమెరికన్‌ సుప్రీంకోర్టు భవంతి ఐదో అంతస్తులో... బాస్కెట్‌ బాల్‌ కోర్టు కూడా ఉంటుంది. ప్రపంచంలో మరే అత్యున్నత న్యాయస్థానంలోనూ ఇలా ఆటస్థలాన్ని చూడలేం.
 • ఒకప్పటి కంప్యూటర్‌ ఓ పెద్ద గది అంత ఉండేదని విని ఉంటాం. మరి హార్డ్‌డిస్క్‌..? గదిలో సగం పరిమాణంలో, టన్ను బరువుండేదట!
 • మన దగ్గర కొన్ని గ్రామాల్లో ఉసిళ్ళనీ ఉప్పుమిడతల్నీ తినే అలవాటుంది. ఐరోపా యూనియన్‌ దేశాల్లో ఈ మధ్యే వాటిని ‘అందరూ తినొచ్చు’ అంటూ ప్రత్యేక చట్టం తెచ్చారు.

ల్ప్స్‌ పర్వతాలనగానే మనకి స్విట్జర్లాండే గుర్తుకొస్తుంది. కానీ ఆస్ట్రేలియాలోనూ ఇదే పేరుతో పర్వతాలు ఉన్నాయి. నిజానికి స్విట్జర్లాండ్‌లో ఉన్నవాటికన్నా వీటిమీదే మంచు ఎక్కువుంటుంది.

లియోనార్డో డావించి గీసిన ‘మొనాలిసా’ చిత్రానికి ప్రేమలేఖలు రాస్తున్నవారూ తక్కువేమీ కాదు. ఆ లేఖల్ని భద్రపరచడానికి- ఈ చిత్రం ఉన్న ఫ్రాన్స్‌లోని లూవర్‌ మ్యూజియంలో ప్రత్యేక ఛాంబర్‌ కూడా ఉంది.

 • ఊళ్ళమీద పడే దొంగల దండుని భయపెట్టేందుకు... క్రీస్తుపూర్వం 200 నుంచి చైనాలో టపాకాయల్ని వాడుతూ వచ్చారు. 
 • శ్రీలంక ప్రజలు ‘ఔను’ అనడానికి తల అడ్డంగా ఊపుతారు. కాదూ... లేదూ అనడానికి ఇంకాస్త వేగంగా ఊపేస్తారు.

నకీ జిరాఫీలకీ మెడ ఎముకలు ఏడే ఉంటాయి. కాకపోతే, జిరాఫీ ఎముకల పొడవు ఎక్కువ అంతే.

సూపర్‌మాల్స్‌లో రకరకాల వాల్‌క్లాక్‌లూ వాచ్‌లూ అమ్మొచ్చుగాక... ఎక్కడా మనం టైం చూసుకోవడానికి వాల్‌క్లాక్‌లు కనిపించవు. సమయాన్ని అస్సలు పట్టించుకోకుండా- షాపింగ్‌లో లీనమవ్వాలన్న ఐడియా అన్నమాట వాళ్ళది.

చార్లెస్‌ డికెన్స్‌... ఎ టేల్‌ ఆఫ్‌ టూ సిటీస్‌, ఆలివర్‌ ట్విస్ట్‌ వంటి ప్రసిద్ధ నవలలు సహా 30 పుస్తకాలు రాసినవాడు. కాకపోతే, వీటన్నింటినీ ఆయన నిల్చునే రాశాడట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..