అలంకరణకు అద్దాల బొమ్మలు

ఇంట్లోని డ్రెస్సింగ్‌ టేబుల్‌కీ, వార్డ్‌రోబ్‌కీ, వాష్‌బేసిన్‌ దగ్గరా అద్దాలను అమర్చడం అనేది ఎప్పటినుంచో ఉన్నదే. అయితే ఇప్పుడా అద్దాలు కూడా అందమైన చిత్రపటాలుగా మారిపోయి గృహాలంకరణలో భాగమయ్యాయి.

Published : 18 Feb 2024 00:15 IST

ఇంట్లోని డ్రెస్సింగ్‌ టేబుల్‌కీ, వార్డ్‌రోబ్‌కీ, వాష్‌బేసిన్‌ దగ్గరా అద్దాలను అమర్చడం అనేది ఎప్పటినుంచో ఉన్నదే. అయితే ఇప్పుడా అద్దాలు కూడా అందమైన చిత్రపటాలుగా మారిపోయి గృహాలంకరణలో భాగమయ్యాయి. ‘అలంకరణకోసం అద్దాలా... చేయి తగిలినా, పిల్లలు ఆడుకునే బంతి పడినా ముక్కలైపోతాయిగా... పైగా వాటన్నింటినీ ఏరడమూ కష్టమే కదా’ అంటారేమో... ఆ భయం లేకుండానే వీటిని ఎంచుకోవచ్చు. ఎందుకంటే... ఈ అద్దాల బొమ్మలన్నీ నచ్చినచోట అతికించుకునేలా అక్రిలిక్‌ స్టిక్కర్ల రూపంలో ఉంటాయి. కోరుకున్న బొమ్మల డిజైన్లతో వచ్చే ఈ స్టిక్కర్లను గదుల్లో అక్కడక్కడా అతికించడం వల్ల... లైటు వేసినప్పుడు ఆ వెలుతురు అద్దాలపైన ప్రతిబింబించి ఇల్లూ మెరిసిపోతుంది. పైగా సందర్భాన్ని బట్టి వాటిని తీసేసి మరోచోటా అతికించు కోవచ్చు కూడా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..