రాగి ముద్దకూ ఓ కుక్కర్‌

రాగి ముద్ద, రాగి సంగటి, జొన్న సంగటి, నూకలతో ముద్దగా చేసే కిచిడీ... వంటివన్నీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిసిందే.

Published : 18 Feb 2024 00:17 IST

రాగి ముద్ద, రాగి సంగటి, జొన్న సంగటి, నూకలతో ముద్దగా చేసే కిచిడీ... వంటివన్నీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిసిందే.అయితే వాటిని చేయాలంటే తయారీ పక్కాగా తెలియడంతోపాటు కాస్త ఓపికా ఉండాలి. ఎందుకంటే.. నీళ్లల్లో ఆ పిండి లేదా రవ్వను వేసి గరిటెతో అదేపనిగా కలుపుతూ ఉంటేనే ఉండలు కట్టకుండా చక్కగా కలిసిపోయి, బాగా ఉడికి తినడానికి రుచిగా అనిపిస్తుంది. అంత శ్రమ, సమయం పెట్టడం కష్టం కానీ... వాటిని అప్పుడప్పుడూ తింటే బాగుండని అనుకునేవారికి ఇప్పుడు ప్రత్యేకంగా ఓ కుక్కర్‌ దొరుకుతోంది. ఇది చూడ్డానికి సాధారణ కుక్కర్‌లానే ఉన్నా దీనికి గరిటె తరహాలో ఓ పరికరం వస్తుంది. కుక్కర్‌లో నీళ్లు పోసి పిండి లేదా రవ్వ వేసుకుని ఆ పరికరాన్ని ఉంచి మూతపెట్టి కలుపుతూ ఉంటే పిండి బాగా ఉడికి, సంగటి చాలా తక్కువ సమయంలోనే తయారవుతుంది. మామూలు గిన్నెల్లో వాటిని చేయడంతో పోలిస్తే దీనివల్ల ఆవిరి ముఖానికి తగలడం, ఉడుకుతున్న పిండి ముఖం లేదా చేతులపైనా చిందడం వంటి సమస్యలు ఎదురుకావు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..