ఇది స్మార్ట్‌ యోగా మ్యాట్‌!

యోగా మ్యాట్‌ రకరకాల రంగుల్లో లేదా డిజైన్లలో మాత్రమే ఉండటం చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఆ మ్యాట్‌నూ స్మార్ట్‌ ఫీచర్లతో తయారుచేశారు నిపుణులు.

Published : 18 Feb 2024 00:18 IST

యోగా మ్యాట్‌ రకరకాల రంగుల్లో లేదా డిజైన్లలో మాత్రమే ఉండటం చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఆ మ్యాట్‌నూ స్మార్ట్‌ ఫీచర్లతో తయారుచేశారు నిపుణులు. అలా వచ్చిందే ఈ ‘యోగిఫి’ మ్యాట్‌. యోగా గురువు అవసరం లేకుండా వ్యక్తిగత ఫిట్‌నెస్‌ ట్రైనర్‌లా పనిచేసే ఈ మ్యాట్‌తో లాభాలు చాలానే ఉన్నాయి. దీన్ని ఏఐతో రూపొందించడం వల్ల ఆప్‌తో అనుసంధానమై ఉంటుంది. ఒక ఆసనాన్ని ఎలా వేయాలో చెబుతూనే సరిగ్గా వేస్తున్నామా లేదా, కాళ్లనూ చేతులనూ ఎంత చాచాం... శరీరాన్ని చెప్పినట్లుగా వంచామా... ఇలా అన్నింటినీ వివరిస్తుంది. ప్రతిరోజూ వేసిన ఆసనాల తాలుకూ హిస్టరీ కూడా ఇందులో పొందుపరిచి ఉంటుంది. బరువునూ గమనించుకోవచ్చు. ఫోనూ, ట్యాబూ, స్మార్ట్‌వాచీనీ అనుసంధానం చేసుకునే ఈ మ్యాట్‌ కేబుల్‌, మొబైల్‌ స్టాండ్‌తో కలిపి వస్తుంది. అప్పుడప్పుడూ ఛార్జింగ్‌ చేసుకుంటే ఒక వ్యక్తిగత ఫిట్‌నెస్‌ గురు మన వెంట ఉన్నట్లే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..