పానీపూరీకీ ఉందో ప్లేట్‌!

ఎన్నిరకాల చిరుతిళ్లు ఎదురుగా ఉన్నా పానీపూరీ కనిపించిందంటే మాత్రం ‘ఇంకోపూరీ వేయ్‌’ అంటూ వరసపెట్టి లాగించేస్తారు పానీపూరీ ప్రియులు.

Published : 24 Feb 2024 23:55 IST

న్నిరకాల చిరుతిళ్లు ఎదురుగా ఉన్నా పానీపూరీ కనిపించిందంటే మాత్రం ‘ఇంకోపూరీ వేయ్‌’ అంటూ వరసపెట్టి లాగించేస్తారు పానీపూరీ ప్రియులు. ప్రతిసారీ బయట తినడం మంచిది కాదనో, సరదాగా ప్రయత్నించి చూద్దామనో చాలామంది ఈమధ్య ఇంట్లోనూ పానీపూరీని తయారుచేస్తున్నారు. అందుకు తగ్గట్టే సులువుగా పానీపూరీని చేసేలా రకరకాల రెడీమేడ్‌ కిట్లూ దొరుకుతున్నాయి. తయారీకేనా... ఇప్పుడు తినడానికీ ప్రత్యేకమైన పానీపూరీప్లేట్లు వచ్చాయి. కాస్త తడి తగిలితే మెత్తగా మారే పూరీల్ని ప్లేట్‌లో విడివిడిగా పెట్టుకుని, మధ్యలో పానీ పోసుకుని ఆస్వాదించేలా ఉంటుందీ ప్లేట్‌. పిల్లలూ మీద పారేసుకోకుండా హాయిగా తినొచ్చు. వస్తువు చిన్నదే కానీ ఉపయోగం పెద్దదే మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..