తలుపుల కవర్లు ఇవి!

అతిథుల్ని ఆహ్వానించే ద్వారం- ఏ పండుగరోజునో, పూజ రోజునో ప్రత్యేకంగా కనిపించాలంటే... అందమైన తోరణాలతో అలంకరిస్తుంటాం. కానీ అంతకు మించి ద్వారమంతా చూడగానే ఆధ్యాత్మిక భావన రావాలంటే...

Published : 24 Feb 2024 23:57 IST

తిథుల్ని ఆహ్వానించే ద్వారం- ఏ పండుగరోజునో, పూజ రోజునో ప్రత్యేకంగా కనిపించాలంటే... అందమైన తోరణాలతో అలంకరిస్తుంటాం. కానీ అంతకు మించి ద్వారమంతా చూడగానే ఆధ్యాత్మిక భావన రావాలంటే... కొత్తగా దేవుడి చిత్రాలతో వస్తున్న ఈ డోర్‌ కవర్లను వాడుకోవచ్చు. ఎలాస్టిక్‌ క్లాత్‌తో ఉండే ఈ కవర్‌ను అవసరమైనప్పుడు డోర్‌కు తొడిగేయొచ్చు, వద్దనుకున్నప్పుడు క్షణంలో తీసేయొచ్చు. ఇదివరకు తలుపు మీద అతికించుకోవడానికి రకరకాల బొమ్మలతో ఉన్న త్రీడీ స్టిక్కర్లలాంటివి వచ్చినా వాటిని తొలగిస్తే మళ్లీ అతికించుకోలేం. కానీ ఇవి అలా కాదు, కావాలనుకున్న రోజు వరకూ మాత్రమే ఉంచుకుని తీసేయొచ్చు, మళ్లీ అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇదంతా బాగానే ఉంది కానీ అందరి ఇళ్ల తలుపులూ ఒకలా ఉండవు కదా అంటారేమో... అందుకే కస్టమైజ్డ్‌ డోర్‌ కవర్లను చేసిస్తున్నారు. ఆన్‌లైన్‌ సైట్లో అందుబాటులో ఉన్న వీటిని- నచ్చిన చిత్రంతో మన ఇంటి డోర్‌కు సరిపోయేలా ఆర్డర్‌ ఇచ్చి చేయించు కోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..