మొక్క కొమ్మలు వంగవిక!

ఇండిపెండెంట్‌ ఇల్లూ దానికి పెద్ద పెరడూ లేకపోయినా చాలావరకూ ఇప్పుడు బాల్కనీల్లోనైనా చిన్న చిన్న మొక్కల్ని పెంచుకుంటున్నారు. పూల నుంచి కూరగాయల మొక్కల వరకూ తమ తమ అభిరుచికి తగ్గట్టు బాల్కనీ గార్డెన్‌ని చక్కగా తయారుచేసుకుంటున్నారు.

Published : 24 Feb 2024 23:59 IST

ఇండిపెండెంట్‌ ఇల్లూ దానికి పెద్ద పెరడూ లేకపోయినా చాలావరకూ ఇప్పుడు బాల్కనీల్లోనైనా చిన్న చిన్న మొక్కల్ని పెంచుకుంటున్నారు. పూల నుంచి కూరగాయల మొక్కల వరకూ తమ తమ అభిరుచికి తగ్గట్టు బాల్కనీ గార్డెన్‌ని చక్కగా తయారుచేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టే ఏ ఇబ్బందీ లేకుండా మొక్కల్ని పెంచుకునేలా బోలెడన్ని వస్తువులూ వస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఈ ప్లాంట్‌ స్టేక్స్‌. ఫ్లవర్‌ సపోర్ట్‌ స్టేక్‌, సపోర్ట్‌ స్టిక్‌ అంటూ రకరకాల పేర్లతో అందుబాటులో ఉన్నాయివి. దీన్ని కుండీలో గుచ్చి పైనున్న రింగ్‌ భాగంతో మొక్కను పట్టి ఉంచితే... కొమ్మలు వంగిపోకుండా నిటారుగా పెరుగుతాయి. ఇలా కొమ్మలు వంకర్లుపోకుండా ఉండేందుకు రకరకాల ప్లాంట్‌ క్లిప్పులూ వచ్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..