బొమ్మల్ని అందంగా సర్దేద్దామా!

పిల్లలున్న ఇంట్లో ఎన్ని రకాల బొమ్మలుంటాయో చెప్పనక్కర్లేదు. ఏ కొత్త బొమ్మ కొన్నా దాంతో కొన్నిరోజులే ఆడతారు. మళ్లీ దానిస్థానంలో ఇంకో బొమ్మ రావాల్సిందే. అందుకే మరి ఇల్లంతా బొమ్మలతోనే నిండిపోతుంది.

Published : 25 Feb 2024 00:02 IST

పిల్లలున్న ఇంట్లో ఎన్ని రకాల బొమ్మలుంటాయో చెప్పనక్కర్లేదు. ఏ కొత్త బొమ్మ కొన్నా దాంతో కొన్నిరోజులే ఆడతారు. మళ్లీ దానిస్థానంలో ఇంకో బొమ్మ రావాల్సిందే. అందుకే మరి ఇల్లంతా బొమ్మలతోనే నిండిపోతుంది. ఆ సమస్య లేకుండా వాటన్నింటినీ పైన ఎక్కడో పెట్టేద్దామంటే... మళ్లీ పిల్లలు ఎప్పుడు, ఏ బొమ్మ కావాలంటారో తెలియదు. అందుకే దీనికి పరిష్కారం చూపిస్తూ బొమ్మల్నీ అందంగా సర్దుకునేలా ‘ట్రాన్స్‌పరెంట్‌ డాల్‌ స్టోరేజ్‌ బకెట్‌, టాయ్‌ స్టోరేజ్‌ ఆర్గనైజర్‌’ పేర్లతో ఎన్నెన్నో బాక్సులు వచ్చాయి. పారదర్శకంగా కనిపించే వీటిల్లో బొమ్మలన్నింటినీ పెట్టేసి గదిలో ఓ మూలన ఉంచామంటే- చూడ్డానికీ ఎంతో అందంగా ఉంటుంది, పైగా అవసరమైనప్పుడు బొమ్మల్ని తీసి ఆడుకోవచ్చు. కోరుకున్న సైజుల్లో దొరుకుతున్నాయివి. మనకు కావాల్సింది కొనుక్కుని వాడుకోవచ్చు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..