చిన్నారుల కార్‌ పిల్లోస్‌ ఇవి!

కారులో దూరపు ప్రయాణాలు చేస్తున్నప్పుడు పిల్లలుంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. వాళ్లకు కావాల్సిన ఆహార పదార్థాలూ బట్టలూ ముందుగానే సర్దుకుంటాం. వాటితో పాటు ప్రయాణాల్లో పిల్లలు హాయిగా నిద్రపోవాలంటే... ఇదిగో ఇక్కడున్న వస్తువుల్నీ పట్టుకెళ్లండి.

Updated : 03 Mar 2024 00:20 IST

కారులో దూరపు ప్రయాణాలు చేస్తున్నప్పుడు పిల్లలుంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. వాళ్లకు కావాల్సిన ఆహార పదార్థాలూ బట్టలూ ముందుగానే సర్దుకుంటాం. వాటితో పాటు ప్రయాణాల్లో పిల్లలు హాయిగా నిద్రపోవాలంటే... ఇదిగో ఇక్కడున్న వస్తువుల్నీ పట్టుకెళ్లండి. కారు సీట్లో తల అటూ ఇటూ పడిపోకుండా, కూర్చున్న దగ్గరే సౌకర్యంగా పడుకునేలా ‘అడ్జస్టబుల్‌ కార్‌ సీట్‌ హెడ్‌ సపోర్ట్‌, కార్‌ స్లీపింగ్‌ హెడ్‌ సపోర్ట్‌’ పేర్లతో పిల్లల కోసం వచ్చిన కార్‌ పిల్లోస్‌ ఇవి. రకరకాల సైజుల్లో దొరుకుతున్న వీటిల్లో- కొన్నింటిని మెడ కింద సపోర్ట్‌గా పెట్టుకోవచ్చు. మరికొన్నింటిని సీట్‌ బెల్టులా పై నుంచి కిందవరకూ ఉంచేసి దాని మీద తల ఆన్చుకుని హాయిగా పడుకోవచ్చు. మనకు నచ్చినట్టుగా దీన్ని సీటుకు తగిలించుకుంటే చాలు... ఎన్ని కుదుపులొచ్చినా పిల్లలు జారిపోకుండా బజ్జుంటారు. పెద్దవాళ్ల ఒళ్లో పడుకుంటామని మారామూ చేయరు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..