గుండీలకూ సరికొత్త మెరుపులు!

ఎలాంటి డిజైన్‌ లేకపోయినా కొన్ని డ్రెస్సులు- వాటికొచ్చే బటన్లతోనే అదిరిపోయే లుక్కుతో కనిపిస్తుంటాయి కదా. ఇలా రెడీమేడ్‌గా వచ్చే బటన్లతోనే కాదండోయ్‌, మనమూ ఏ సాదా గుండీనైనా అందంగా మార్చుకోవచ్చు. అవును, బటన్‌ కవర్ల పేరుతో మార్కెట్లో బోలెడన్ని రకాలు దొరుకుతున్నాయిప్పుడు.

Updated : 03 Mar 2024 00:22 IST

లాంటి డిజైన్‌ లేకపోయినా కొన్ని డ్రెస్సులు- వాటికొచ్చే బటన్లతోనే అదిరిపోయే లుక్కుతో కనిపిస్తుంటాయి కదా. ఇలా రెడీమేడ్‌గా వచ్చే బటన్లతోనే కాదండోయ్‌, మనమూ ఏ సాదా గుండీనైనా అందంగా మార్చుకోవచ్చు. అవును, బటన్‌ కవర్ల పేరుతో మార్కెట్లో బోలెడన్ని రకాలు దొరుకుతున్నాయిప్పుడు. చిన్న క్లిప్పులా ఉండే వీటిని ఫొటోలో చూపినట్టుగా సులువుగా గుండీపైన అమర్చు కోవచ్చు. అమ్మాయిల డ్రెస్సులకూ అబ్బాయిల చొక్కాలకూ సరిపోయేలా... సొగసైన డిజైన్లలో బంగారు, వెండి రంగులతో పాటూ ముత్యాలూ, పగడాలతో మెరిసిపోయేలా వచ్చాయివి. కావాలంటే మన పేరు అక్షరంతో వచ్చే పర్సనలైజ్డ్‌ బటన్‌ కవర్లూ ఉన్నాయి. ఆఫీస్‌ వేర్‌ హుందాతనాన్ని తెచ్చిపెట్టేలా, పార్టీలో వేసుకునే దుస్తులకు అదనపు అందం అద్దేలా ఉండే వీటిని మీరూ ట్రై చేసి చూడండి. చిన్న అలంకరణే అయినా తప్పకుండా అందరిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది మరి!


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..