అందులోనే అన్ని కేబుళ్లు!

ఫోన్‌ ప్రతి ఒక్కరి చేతుల్లోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడికైనా వెళుతుంటే మిగిలిన వాటితో పాటూ తప్పనిసరి వస్తువుల్లో ఫోన్‌కు సంబంధించిన ఛార్జర్లూ కేబుళ్లలాంటివీ చేరాయి.

Published : 03 Mar 2024 00:24 IST

ఫోన్‌ ప్రతి ఒక్కరి చేతుల్లోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడికైనా వెళుతుంటే మిగిలిన వాటితో పాటూ తప్పనిసరి వస్తువుల్లో ఫోన్‌కు సంబంధించిన ఛార్జర్లూ కేబుళ్లలాంటివీ చేరాయి. అందుకే వాటిని పట్టుకెళ్లే విషయంలో మరింత సౌకర్యాన్ని ఇస్తూ ఎన్నో రకాల కొత్త వస్తువులు మార్కెట్లో కనిపిస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఇక్కడున్న ‘మల్టీ ఫంక్షనల్‌ ట్రావెల్‌ కేబుల్‌ కేస్‌’. ఒకే దాంట్లో ఆపిల్‌, సి-టైప్‌, ఇతర ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లకు సరిపోయే మల్టీ ఛార్జింగ్‌ కేబుళ్లూ, డేటా షేరింగ్‌ కేబుళ్లూ అన్నీ ఉంటాయి. ప్రయాణాల్లో ఎక్కడికైనా వెళ్లినప్పుడు జేబులోనో, హ్యాండ్‌ బ్యాగులోనో పెట్టుకుని సులువుగా పట్టుకెళ్లొచ్చు. ఇంకా ఈ కేసును ఫోన్‌, ట్యాబ్‌లకు స్టాండ్‌లానూ వాడుకోవచ్చు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..