లైట్లపైన బొమ్మలు... భలే ఉన్నాయే!

పుట్టినరోజు పార్టీ, గెట్‌ టు గెదర్‌, చిన్న శుభకార్యం... వేడుక ఏదైనా సరే, పూల దండలూ, మెరిసే పరదాలూ చిన్నచిన్న పూల కుండీలతో ఇంటిని అలంకరించేస్తుంటాం.

Published : 03 Mar 2024 00:27 IST

పుట్టినరోజు పార్టీ, గెట్‌ టు గెదర్‌, చిన్న శుభకార్యం... వేడుక ఏదైనా సరే, పూల దండలూ, మెరిసే పరదాలూ చిన్నచిన్న పూల కుండీలతో ఇంటిని అలంకరించేస్తుంటాం. వాటన్నింటితోపాటూ ఈసారి ఈ ‘గూవీ కర్టెన్‌ లైట్ల’నూ వేలాడదీస్తే వేడుకకి నిండుదనంతోపాటూ అతిథులూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే... ఈ లైట్లు కాన్వాస్‌లా మారిపోయి... వాటిపైన కోరుకున్న బొమ్మలు వచ్చేస్తాయన్నమాట. ఈ లైట్ల వరసల్ని గోడలు/కర్టెన్లకు అమర్చాక రిమోట్‌ సాయంతో కావాల్సిన బొమ్మల్ని వాటిపైన ప్రతిబింబించేలా చేసుకోవచ్చు. లేదూ... సెల్‌ఫోనును రిమోట్‌కు అనుసంధానం చేస్తే కోరుకున్న జిఫ్‌లూ సందర్భాన్ని బట్టి కార్టూన్‌ బొమ్మలూ, ఎమోజీలూ, చిన్నచిన్న సందేశాలూ... ఇలా ఏవైనా వాటిపైన కనిపించేలా చేయడమే వీటి ప్రత్యేకత. అలా డిజైన్లు వచ్చేలా ఈ లైట్లు కూడా చిన్నచిన్న పూసల దండల్లా ఉంటాయి. వాటిని వేలాడదీసేందుకు హుక్కులూ, రిమోట్‌తో కలిపి సెట్‌లా వస్తాయివి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..