ఫోన్‌కూ ఉంది రిమోట్‌!

టీవీని ఆపరేట్‌ చేసుకోవడానికి రిమోట్‌ కంట్రోల్‌ ఉన్నట్టే ఫోన్‌కూ ఉంటే ఎలా ఉంటుందీ అనుకున్నారేమో తయారీదారులు... ఫోన్‌ కోసం ‘బ్లూటూత్‌ రిమోట్‌ కంట్రోల్‌ రింగ్‌’ను తీసుకొచ్చారు. చిన్న ఉంగరంలా ఉండే ఈ గ్యాడ్జెట్‌ను ఫోన్‌కు బ్లూటూత్‌ ద్వారా కనెక్ట్‌ చేసుకోవచ్చు.

Updated : 17 Mar 2024 04:56 IST

టీవీని ఆపరేట్‌ చేసుకోవడానికి రిమోట్‌ కంట్రోల్‌ ఉన్నట్టే ఫోన్‌కూ ఉంటే ఎలా ఉంటుందీ అనుకున్నారేమో తయారీదారులు... ఫోన్‌ కోసం ‘బ్లూటూత్‌ రిమోట్‌ కంట్రోల్‌ రింగ్‌’ను తీసుకొచ్చారు. చిన్న ఉంగరంలా ఉండే ఈ గ్యాడ్జెట్‌ను ఫోన్‌కు బ్లూటూత్‌ ద్వారా కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఫోన్‌ పట్టుకోకుండానే రింగ్‌ మీదున్న బటన్లు నొక్కుతూ ఫోన్‌ను ఆపరేట్‌ చేయొచ్చు. ఫోన్‌ కాస్త దూరంగా ఉంచి ఫొటోలూ, వీడియోలూ తీసుకోవచ్చు. ఏవైనా వీడియోలూ, సినిమాలూ చూస్తున్నప్పుడు ఫోన్‌ను కంటికి కాస్త దూరంగా ఉంచి, చేతిలో ఉన్న రింగు ద్వారా కావాల్సినవి పెట్టుకోవచ్చు. ఫోన్‌ ఎక్కువగా వాడేవారికి దీన్ని బహుమతిగా ఇచ్చారంటే కచ్చితంగా ఎంతో సంతోషిస్తారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..