మెరిసే మెటల్‌ స్టికర్లు!

కారు మీదనో ఫోన్‌పైనో లేదంటే వాలెట్‌ మీదో చాలామంది రకరకాల స్టికర్లు అతికించుకుంటారు. తమ పేరులోని అక్షరాలూ, నచ్చిన బొమ్మా, చక్కని కొటేషన్‌... ఇలా ఏదో ఒక స్టికర్‌తో సృజనను చూపిస్తుంటారు.

Published : 17 Mar 2024 00:26 IST

కారు మీదనో ఫోన్‌పైనో లేదంటే వాలెట్‌ మీదో చాలామంది రకరకాల స్టికర్లు అతికించుకుంటారు. తమ పేరులోని అక్షరాలూ, నచ్చిన బొమ్మా, చక్కని కొటేషన్‌... ఇలా ఏదో ఒక స్టికర్‌తో సృజనను చూపిస్తుంటారు. అందుకే స్టికర్లలో బోలెడన్ని రకాలు వస్తున్నాయి. అలాంటివాటిల్లో ఒకటి ఇక్కడున్న త్రీడీ మెటల్‌ స్టికర్లు. అక్షరాలూ, దేవుని చిత్రాలూ, అందమైన డిజైన్లూ, లోగోలూ... ఇలా వీటిల్లో ఎన్నెన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. అచ్చం వెండి, బంగారు లోహాల్లా కనిపించే ఈ స్టికర్లలో మనం కోరుకున్న దాన్ని ప్రత్యేకంగా చేయించుకోవచ్చు కూడా. పైనున్న కాగితాన్ని తీసి నచ్చిన వస్తువు మీద అతికించు కుంటే సరి, మెటల్‌ అక్షరాలు దానిపైన చెక్కినట్టుగానే కనిపిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..