పిల్లల కోసం కదిలే చేపలు

చిన్నారులకు బొమ్మలంటే మహా ఇష్టం. అందులోనూ కదులుతూ శబ్దాలు చేసే బొమ్మలంటే మరీనూ. ఈ చేప బొమ్మలూ అలానే భలేగా ఉంటాయి.

Published : 17 Mar 2024 00:28 IST

చిన్నారులకు బొమ్మలంటే మహా ఇష్టం. అందులోనూ కదులుతూ శబ్దాలు చేసే బొమ్మలంటే మరీనూ. ఈ చేప బొమ్మలూ అలానే భలేగా ఉంటాయి. ‘స్విమింగ్‌ రోబోట్‌ ఫిష్‌’, ‘క్రాలింగ్‌ ఫిష్‌ టాయ్‌’ పేర్లతో రకరకాల చేపల బొమ్మలు మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిల్లో బ్యాటరీలతో వచ్చే ఫిష్‌టాయ్స్‌ నీటిలో అటూ ఇటూ నిజమైన చేప పిల్లల్లా ఈత కొడతాయి. వాటర్‌ సెన్సర్‌ టెక్నాలజీతో పనిచేసే ఈ బొమ్మల్ని నీటిలో వేయగానే కదులుతాయన్న మాట. మరికొన్నేమో... కీ ఇస్తే నేలపైన తోక ఊపుతూ చుట్టూ తిరుగుతుంటాయి. పిల్లల వయసును బట్టి ఈ బొమ్మల్ని కొనిపెట్టారంటే... పిల్లలు టబ్‌లో స్నానం చేస్తూ సరదాగా వీటినీ వేసుకుంటారు, కీ ఇస్తే తిరిగే ఫిష్‌ బొమ్మల్నేమో నేలపైన పెట్టుకుని ఎంచక్కా ఆడుకుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..