దీపం కొండెక్కకుండా...

పండుగలప్పుడూ, ప్రత్యేక పూజలు చేసినప్పుడూ కొంతమంది ఆ రోజంతా దీపం వెలుగుతూ ఉండాలను కుంటారు. అది కొండెక్కకుండా ఉండటానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారు.

Published : 23 Mar 2024 23:46 IST

పండుగలప్పుడూ, ప్రత్యేక పూజలు చేసినప్పుడూ కొంతమంది ఆ రోజంతా దీపం వెలుగుతూ ఉండాలను కుంటారు. అది కొండెక్కకుండా ఉండటానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారు. ఎప్పటి కప్పుడు వత్తులు సరి చేయడమూ, కుందుల్లో నూనె పోయడం లాంటివి చేస్తుంటారు. ఇలాంటి అవసరాల కోసమే ‘అఖండ్‌ దీప్‌’ పేరుతో దీపాలు వచ్చాయి. ఫొటోలో చూపినట్టుగా దీపం పక్కన పెద్ద నూనె గాజు గిన్నె కూడా ఉంటుంది. దాన్నిండా నూనె పోశామంటే... పక్కనున్న కుందులోని నూనె తగ్గినకొద్దీ పెద్ద గిన్నెలోంచి నూనె దీంట్లోకి చేరుతుంది. దీంతో నిరంతరాయంగా దీపం వెలుగుతూ ఉంటుంది. వీటిల్లో చిన్న సైజు నుంచి లీటర్‌ నూనె సరిపోయేంత పెద్ద సైజు వరకూ ఉన్నాయి. చుట్టూ ఐదు దీపాలతో ఉన్నవీ దొరుకుతాయి. మన అవసరాన్ని బట్టి ఎంచుకుని పూజలో భాగం చేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..