కథ చెబుతుంది బొమ్మలు చూపుతుంది!

కథలంటే ఇష్టపడని పిల్లలెవరుంటారు చెప్పండి. అందుకే చిన్నారుల కోసం మామూలు బొమ్మలతో పాటూ కథలు చెప్పే ఆట వస్తువులూ మార్కెట్లోకి చాలానే వస్తుంటాయి.

Published : 23 Mar 2024 23:49 IST

థలంటే ఇష్టపడని పిల్లలెవరుంటారు చెప్పండి. అందుకే చిన్నారుల కోసం మామూలు బొమ్మలతో పాటూ కథలు చెప్పే ఆట వస్తువులూ మార్కెట్లోకి చాలానే వస్తుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఇక్కడున్న ‘లిటిల్‌ స్టోరీ డ్రీమ్‌ మెషీన్‌’. ఇది పిల్లలకు కథలు చెప్పడమే కాదు, చూపిస్తుంది కూడా. ప్రొజెక్టర్‌తో ఉండే ఈ సెట్‌లో పిల్లలకు నచ్చే పాత్రలతో బొమ్మల కథలుంటాయి. బటన్‌ నొక్కగానే ఆడియో వినబడుతూ ప్రొజెక్టర్‌ ద్వారా గోడ మీద బొమ్మలు కనిపిస్తాయి. హాయిగా పిల్లలు కథలు వింటూ బొమ్మలు చూడొచ్చన్నమాట. పుట్టినరోజున దీన్ని బహుమతిగా ఇచ్చారంటే... కథలంటే ఇష్టపడే చిన్నారులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతారు మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..