ఈ ట్రేలో ఏదీ జారిపడదు!

ఇంటికి వచ్చినవారికి కాఫీ టీలూ కూల్‌డ్రింకులూ ట్రేలో పెట్టుకుని అందిస్తుంటాం. ఒక్కోసారి అనుకోకుండా చేయి తగిలినప్పుడు ట్రేలో ఉంచిన గిన్నెలూ గ్లాసులూ పడిపోయి, అందులోని పదార్థాలు ఒలికిపోతుంటాయి కదా.

Published : 23 Mar 2024 23:51 IST

ఇంటికి వచ్చినవారికి కాఫీ టీలూ కూల్‌డ్రింకులూ ట్రేలో పెట్టుకుని అందిస్తుంటాం. ఒక్కోసారి అనుకోకుండా చేయి తగిలినప్పుడు ట్రేలో ఉంచిన గిన్నెలూ గ్లాసులూ పడిపోయి, అందులోని పదార్థాలు ఒలికిపోతుంటాయి కదా. కానీ ఇక్కడున్న ట్రేతో... ఆ ఇబ్బందే ఉండదు. ఎందుకంటే ఇది నాన్‌ స్లిప్‌ సర్వింగ్‌ ట్రే మరి. ప్లాస్టిక్‌, మెటల్‌తో వచ్చే ఈ ట్రే పైనా కిందా కూడా నాన్‌స్లిప్‌ సిలికాన్‌ గ్రిడ్‌ లాంటిది ఉంటుంది. దీనివల్ల ట్రేలో ఉంచిన పాత్రలేవీ పక్కకు జరగవన్నమాట. ట్రేని కాస్త వంచినా గిన్నెల్లోని పదార్థాలు పడిపోవు. రకరకాల సైజుల్లో వేరువేరు ఆకారాల్లో అందుబాటులో ఉన్నాయి ఇవి. మామూలు ట్రేలకు బదులు వీటిని కొన్నామంటే ఎంతో ఉపయోగంగా ఉంటుందంటే నమ్మండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..