బాల్కనీ కోసం ఓ టేబుల్‌!

సాయంత్రం వేళ వేడి వేడి టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూనో, పొద్దు పొద్దున పేపర్‌ చదువుకుంటూనో చాలామంది బాల్కనీలో కూర్చుంటారు. బయటి గాలిని ఆస్వాదిస్తూ కాసేపు సేదతీరుతుంటారు.

Published : 23 Mar 2024 23:54 IST

సాయంత్రం వేళ వేడి వేడి టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూనో, పొద్దు పొద్దున పేపర్‌ చదువుకుంటూనో చాలామంది బాల్కనీలో కూర్చుంటారు. బయటి గాలిని ఆస్వాదిస్తూ కాసేపు సేదతీరుతుంటారు. అందుకే మరి, బాల్కనీ పరిసరాలూ ప్రశాంతంగా ఉండటానికి మొక్కల్ని పెంచుకోవడం లాంటివి చేస్తుంటారు. ఇదంతా సరే, మరి పుస్తకాలూ, పత్రికలూ టీ కాఫీల గ్లాసులు పెట్టుకోవడానికి కుర్చీలతో పాటూ చిన్న టేబుల్‌ కూడా ఉంటే బాగుంటుంది కదా. చోటు ఉంటే టేబుల్‌ని సెట్‌ చేసుకోవచ్చు కానీ లేకపోతే ఎలా... ఇదిగో అలాంటప్పుడే చక్కని పరిష్కారం చూపిస్తున్నాయి  ‘బాల్కనీ టేబుళ్లు’. ప్లాస్టిక్‌, గాజు, మెటల్‌తో తయారు చేసిన ఈ టేబుళ్లు చిన్నవే అయినా బాల్కనీ గోడపైనో, రైలింగ్‌కో అమర్చుకోవచ్చు. కొన్నింటిని అవసరమైనప్పుడు మాత్రమే వాడుకుంటూ మళ్లీ మడత పెట్టుకోవచ్చు కూడా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..