నగలూ, కుచ్చిళ్లూ కదలవిక!

ఎన్ని పిన్నీసులు పెట్టి చీర కట్టినా ఒక్కోసారి పైట కొంగు దగ్గర కుచ్చిళ్లు పక్కకు పోతుంటాయి. వరసలుగా వేసుకున్న హారాలూ కాస్త అటూ ఇటూ జరుగుతాయి. 

Published : 06 Apr 2024 23:57 IST

ఎన్ని పిన్నీసులు పెట్టి చీర కట్టినా ఒక్కోసారి పైట కొంగు దగ్గర కుచ్చిళ్లు పక్కకు పోతుంటాయి. వరసలుగా వేసుకున్న హారాలూ కాస్త అటూ ఇటూ జరుగుతాయి.  ఎప్పటికప్పుడు చూసుకుంటూ సరిచేసుకోకపోతే ఫొటోల్లో అలాగే వస్తుంటాయి. పైగా ప్రతిసారీ వాటిని సరిచేసుకోవాల్సి వస్తుంది కూడా. ఇప్పుడు అలాంటి ఇబ్బందే లేకుండా కట్టిన చీర కట్టినట్టు, పెట్టిన నగలు పెట్టినట్టుగా ఉండాలంటే... డ్రెస్‌ ఫిటింగ్‌ డబుల్‌ సైడ్‌ టేప్‌, ఫ్యాషన్‌ డ్రెసింగ్‌ టేప్‌ పేర్లతో వచ్చే ఈ వస్తువును వాడితే సరి. చిన్న చిన్న ముక్కల్లా పారదర్శకంగా ఉండే ఈ టేపును నగల కింద చీరపైనో, కుచ్చిళ్ల కిందనో అతికించుకోవచ్చు. రెండువైపులా అతుక్కుని ఉండటం వల్ల అవి ఎటూ కదలకుండా ఉంటాయన్నమాట. ఇంకా ప్యాంటు ఫోల్డింగ్‌ కోసం, చొక్కా గుండీల మధ్య ఉన్న ఖాళీల్ని కనిపించకుండా చేయడానికీ వీటిని వాడుకోవచ్చు. చిన్న వస్తువే అయినా చాలా సౌకర్యంగా ఉంటుందంటే నమ్మండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..