జంతికలకో మెషీన్‌!

కారంకారంగా తినడానికి కారప్పూసా, మురుకుల్లాంటివి బాగానే ఉంటాయి కానీ వాటిని చేయడం మాత్రం కష్టంగానే ఉంటుంది.

Published : 06 Apr 2024 23:58 IST

కారంకారంగా తినడానికి కారప్పూసా, మురుకుల్లాంటివి బాగానే ఉంటాయి కానీ వాటిని చేయడం మాత్రం కష్టంగానే ఉంటుంది. వీటిల్లో నచ్చిన రకాల్ని చేసుకోవడానికి బోలెడన్ని అచ్చులు అందుబాటులో ఉండటం సరే కానీ పిండి ముద్దను అందులో ఉంచి జంతికల్ని వత్తడం కాస్త ఇబ్బందే. బలం ఉపయోగిస్తూ నొక్కుతుంటే ఎవరికైనా చేతులు నొప్పులు పుడతాయి. దీనికి పరిష్కారంగానే ఇప్పుడు పోర్టబుల్‌ ఆటోమేటిక్‌ పాస్తా మెషీన్‌ వచ్చింది. దీనికి జతగా రకరకాల ఆకారాల రంధ్రాలతో ఉండే అచ్చులొస్తాయి కాబట్టి సన్నకారప్పూస దగ్గర్నుంచి వంపుల జంతికల వరకూ ఈ మెషీన్‌ సాయంతో నచ్చినన్ని చేసుకోవచ్చు. బ్యాటరీలతో పనిచేసే ఈ ఎలక్ట్రిక్‌ మెషీన్‌లో పిండి ముద్దని ఉంచి బటన్‌ నొక్కామంటే కోరుకున్న మురుకులు క్షణాల్లో తయారవుతాయి. ఆలస్య మెందుకు, వంటలకు ఉపయోగపడే రకరకాల ఎలక్ట్రిక్‌ వస్తువుల పక్కన దీన్నీ చేర్చండి మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..