బాటిల్‌ అంచులన్నీ శుభ్రమే!

నీళ్లకోసం ఇంటా, బయటా చాలామంది వాటర్‌ బాటిళ్లు వాడుతుంటారు. ప్లాస్టిక్‌ వద్దంటూ స్టీల్‌ బాటిళ్ల లాంటివే ఎక్కువమంది ఎంచుకుంటున్నారు కూడా.

Published : 06 Apr 2024 23:59 IST

నీళ్లకోసం ఇంటా, బయటా చాలామంది వాటర్‌ బాటిళ్లు వాడుతుంటారు. ప్లాస్టిక్‌ వద్దంటూ స్టీల్‌ బాటిళ్ల లాంటివే ఎక్కువమంది ఎంచుకుంటున్నారు కూడా. ఇంతవరకూ బాగానే ఉంది కానీ వాటి శుభ్రత విషయంలోనే సమస్యంతానూ. ఎప్పుడూ నీళ్లు ఉండటం వల్ల మూత అంచులూ, లోపలా మురికి పేరుకుపోతుంది. క్లీనింగ్‌ బ్రష్‌లతోపాటూ టూత్‌బ్రష్‌లాంటిది తీసుకుని దాన్ని తొలగిస్తుంటాం. కానీ ఆ ప్రయాసేమీ లేకుండా మల్టీ పర్పస్‌ బాటిల్‌ క్లీనర్‌ని వాడుకోవచ్చు. ఒకేదాంట్లో మూడు రకాల క్లీనింగ్‌ బ్రష్‌లతో బాటిల్‌ మొత్తాన్ని సులువుగా శుభ్రపరిచేలా ఉంటుందిది. ఎవరైనా తేలికగా వాడేలా ఉండే ఈ బ్రష్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మామూలు వాటికి బదులు ఈసారి దీన్నే కొంటే సరి... ఎంతో ఉపయోగ పడుతుంది, ఏమంటారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..