ఇంట్లోనే పిండిమర!

పాత తరం పిండిమరకి కొత్తతరం ఎలక్ట్రిక్‌ టచ్‌ ఇస్తే ఎలా ఉంటుందీ అనుకున్నారేమో తయారీదారులు- ఇదిగో ఇక్కడున్న వుడ్‌ అండ్‌ గ్రానైట్‌ స్టోన్‌ ఎలక్ట్రిక్‌ గ్రైన్‌ మిల్‌ని తీసుకొచ్చారు.

Published : 07 Apr 2024 00:00 IST

పాత తరం పిండిమరకి కొత్తతరం ఎలక్ట్రిక్‌ టచ్‌ ఇస్తే ఎలా ఉంటుందీ అనుకున్నారేమో తయారీదారులు- ఇదిగో ఇక్కడున్న వుడ్‌ అండ్‌ గ్రానైట్‌ స్టోన్‌ ఎలక్ట్రిక్‌ గ్రైన్‌ మిల్‌ని తీసుకొచ్చారు. దీంతో పప్పులూ, ధాన్యాలూ ఇంట్లోనే పిండి పట్టుకోవచ్చు. మామూలు మిక్సర్‌, గ్రైండరు అయితే ధాన్యాలూ, పప్పులూ ఆడించి పిండి చేసుకోవడానికి వీలుగా ఉండవు. కానీ ఇంటి అవసరాల కోసమే తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్‌ మిల్‌లో మాత్రం బయట మిల్లులో పట్టించినట్టే పిండి వస్తుంది. ఎన్నిరకాల మిక్సీలు వచ్చినా కొందరు సంప్రదాయ పద్ధతుల్లో పట్టిన పిండే రుచిగా ఉంటుందంటారు. అలాంటి వారికి ఈ హోమ్‌ మిల్‌ మెషీన్‌ మంచి ఛాయిస్‌... బయటకి వెళ్లే పని లేకుండా ఇంట్లోనే పిండిని పట్టుకోవచ్చు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..