వెండి నాణేల బొకేలివి!

ప్రియమైన వాళ్ల మనసు గెలవాలనీ, సన్నిహితుల ముఖాల్లో ఆనందం తేవాలనీ ప్రత్యేక సందర్భాల్లో సరికొత్త బహుమతులు అందిస్తుంటారు. అలాంటి వాళ్ల మనసెరిగే మార్కెట్లోనూ నయా ట్రెండ్స్‌ పుట్టుకొస్తుంటాయి.

Updated : 14 Apr 2024 01:16 IST

ప్రియమైన వాళ్ల మనసు గెలవాలనీ, సన్నిహితుల ముఖాల్లో ఆనందం తేవాలనీ ప్రత్యేక సందర్భాల్లో సరికొత్త బహుమతులు అందిస్తుంటారు. అలాంటి వాళ్ల మనసెరిగే మార్కెట్లోనూ నయా ట్రెండ్స్‌ పుట్టుకొస్తుంటాయి. ఇక్కడున్న సిల్వర్‌ కాయిన్‌ బొకే కూడా అలా వచ్చిందే. పదికాలాల పాటు భద్రంగా దాచుకునేలా ఇష్టమైన వారి ఫొటోలూ, చెప్పాలనుకున్న మాటలూ జోడిస్తూ తయారుచేసిన వెండి నాణేల కానుక బోర్‌ కొట్టేసినట్టుంది. ఇప్పుడు ఇంకాస్త మార్పు చేస్తూ వెండి నాణేల్ని అందంగా అమర్చి కాయిన్‌ బొకేల్ని తీసుకొచ్చారు. లక్ష్మీదేవి, గణపతి, సీతారాములు... ఇలా దేవుళ్ల రూపాలతో పాటు మనకు నచ్చిన ఫొటోల్నీ కస్టమైజ్‌ చేసుకోవచ్చు. నాణేలకు జతగా అందమైన బొమ్మలూ, పువ్వులూ కలిపి డెకరేట్‌ చేసి ఇచ్చారంటే... ఆ అరుదైన బహుమతిని తీసుకున్న క్షణాల్నీ ఎవరూ ఎప్పటికీ మరిచిపోరంటే నమ్మండి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..