క్లిప్పులాంటి జిప్‌!

డ్రెస్సుల నుంచి బ్యాగుల వరకూ చాలా వాటికి జిప్‌ సిస్టమ్‌ ఉంటుంది. కొన్నిసార్లు ఆ డ్రెస్సులూ, బ్యాగులూ బాగానే ఉన్నా... జిప్‌ పాడవ్వడం వల్ల వాటిని సరిచేసుకునే వీలు లేక, అలాగే పక్కన పెట్టేస్తుంటాం.

Published : 14 Apr 2024 01:18 IST

డ్రెస్సుల నుంచి బ్యాగుల వరకూ చాలా వాటికి జిప్‌ సిస్టమ్‌ ఉంటుంది. కొన్నిసార్లు ఆ డ్రెస్సులూ, బ్యాగులూ బాగానే ఉన్నా... జిప్‌ పాడవ్వడం వల్ల వాటిని సరిచేసుకునే వీలు లేక, అలాగే పక్కన పెట్టేస్తుంటాం. కానీ ఇప్పుడు పాడైపోయిన అలాంటి జిప్పుల్నీ మనమే ఇంట్లో బాగు చేసుకోవచ్చు. ‘ఫిక్స్‌ జిప్‌ పుల్లర్‌, ఇన్‌స్టంట్‌ జిప్పర్‌ సెట్‌’ పేర్లతో ఆన్‌లైన్‌ సైట్లలో దొరుకుతున్నాయివి. క్లిప్పులా ఉండే దీన్ని ఊడిపోయిన జిప్పర్‌ మీద పెట్టి గట్టిగా నొక్కితే చాలు, జిప్‌ సెట్‌ అయిపోతుంది. క్షణాల్లో ఆ వస్తువును మామూలుగా వాడుకోవచ్చు. ఎలాంటి జిప్‌ చెయిన్లకైనా సరిపోయేలా రకరకాల ఇన్‌స్టంట్‌ జిప్స్‌ అందుబాటులో ఉన్నాయి. వేసుకున్న దుస్తుల జిప్‌ ఊడిపోయినా, ప్రయాణాల్లో బ్యాగుల జిప్‌లు పాడైపోయినా అత్యవసరంగా వీటిని వాడుకోవచ్చు. చిన్న వస్తువే కానీ అప్పటికప్పుడు మాత్రం సమస్యను తీర్చేస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..