నొప్పిని తగ్గించే బొమ్మలు!

చిన్నారులకు జ్వరం వచ్చినా దెబ్బ తగిలినా వాళ్లను ఒప్పించి మందులివ్వడమేకాదు, శరీర ఉష్ణోగ్రత తగ్గడానికి తలపైన తడి గుడ్డనూ ఉంచలేం, వాపు మీద వేడినీళ్లతో కాపడాన్నీ పెట్టలేం.

Published : 14 Apr 2024 01:19 IST

చిన్నారులకు జ్వరం వచ్చినా దెబ్బ తగిలినా వాళ్లను ఒప్పించి మందులివ్వడమేకాదు, శరీర ఉష్ణోగ్రత తగ్గడానికి తలపైన తడి గుడ్డనూ ఉంచలేం, వాపు మీద వేడినీళ్లతో కాపడాన్నీ పెట్టలేం. అది దృష్టిలో ఉంచుకునే పిల్లలకు నచ్చేట్టు బోలెడన్ని నొప్పిని తగ్గించే వస్తువులూ మార్కెట్లోకి వస్తుంటాయి. ‘ఫోమీ కిడ్స్‌ ఫన్‌ పెయిన్‌ రిలీవింగ్‌ హాట్‌ అండ్‌ కోల్డ్‌ ప్యాక్‌’, ‘హలో మాస్క్‌ కిడ్స్‌ ఐస్‌ ప్యాక్‌’ పేర్లతో దొరికే ఈ ప్యాకులూ అలాంటివే. ఏనుగు, సింహం, పాండాలాంటి జంతువుల బొమ్మలూ రకరకాల కార్టూన్‌ పాత్రల చిత్రాలతో చూడ్డానికీ భలేగా ఉంటాయి. చల్లదనం కోసం ఫ్రిజ్‌లో, వెచ్చదనం కోసం వేడినీళ్లలో పెట్టుకుని అవసరమైన చోట వాడుకోవచ్చు. బొమ్మలతో ఉండే ఈ ప్యాకుల్ని చూస్తే పిల్లలూ వద్దని మారాం చేయరు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..