ఐస్‌క్రీమ్‌ గిన్నెలివి!

ఇంటికొచ్చిన అతిథులకు మనమిచ్చే కమ్మకమ్మని, చల్లచల్లని ఐస్‌క్రీమ్‌ కన్నా ముందుగా దాన్ని పెట్టి ఇచ్చే గిన్నెనే నోరూరిస్తే- భలేగా ఉంటుంది కదూ.

Published : 20 Apr 2024 23:58 IST

ఇంటికొచ్చిన అతిథులకు మనమిచ్చే కమ్మకమ్మని, చల్లచల్లని ఐస్‌క్రీమ్‌ కన్నా ముందుగా దాన్ని పెట్టి ఇచ్చే గిన్నెనే నోరూరిస్తే- భలేగా ఉంటుంది కదూ. పిల్లలకు రకరకాల ఐస్‌క్రీమ్స్‌ని కలిపి దాన్ని ఐస్‌కోన్‌ పాత్రలో వేసి ఇస్తే- ఎంతో ముచ్చటపడిపోరూ. ఇలాంటి సరదాలు తీరాలంటే ఇంట్లో ఇతర పాత్రలతో పాటూ ఇక్కడ కనిపిస్తున్న ఐస్‌క్రీమ్‌ బౌల్స్‌ని కొని తెచ్చుకోండి. ఐస్‌క్రీమ్‌ కోన్‌, ఐస్‌క్రీమ్‌ కప్‌ ఆకారాల్లో చెంచా, గిన్నెలతో కలిపి సెట్లుగా దొరుకుతున్నాయి. ప్లాస్టిక్‌, సిరామిక్‌, మెటల్‌ పదార్థాలతో రంగు రంగుల్లో ఎన్నో వెరైటీల్లో ఉన్నాయివి. బంధువులొచ్చినప్పుడో, ఇంట్లో అందరికీ సరిపోవాలనుకున్నప్పుడో ఐస్‌క్రీమ్‌ డబ్బాల్ని కొని తెస్తే, ఎంచక్కా వీటిల్లో పెట్టుకుని ఆ చల్లని ఐస్‌క్రీమ్‌ని ఆస్వాదించొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు